Education: ఆంధ్ర యూనివర్సిటీలో ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు
ABN , First Publish Date - 2023-08-18T16:52:50+05:30 IST
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(ఎ్‌సడీఈ)-ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది.
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(ఎ్‌సడీఈ)-ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. విదేశీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులకు సంబంధిత స్టడీ మెటీరియల్ అందిస్తారు. ప్రోగ్రామ్‌లకు నిర్దేశించిన సిలబస్ కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు
బీఏ(హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్), బీకాం, బీకాం(అకౌంటెన్సీ) ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. గరిష్ఠంగా ఆరేళ్లలో పూర్తిచేసే వీలుంది. ఇంటర్/రెండేళ్ల ఐటీఐ/పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణులు; వెటర్నరీ/అగ్రికల్చర్ డిప్లొమా పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీఓఎ్‌స/ఎన్‌ఐఓఎస్ అభ్యర్థులు కూడా అర్హులే.
పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు
ఎంఏ(సోషియాలజీ/పొలిటికల్ సైన్స్/హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్/ఎకనామిక్స్/ఇంగ్లీష్), ఎంబీఏ, ఎంసీఏ, ఎంకాం, ఎమ్మెస్సీ(సైకాలజీ) ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. గరిష్ఠంగా నాలుగేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి.
అర్హత: ఎంసీఏలో ప్రవేశానికి బీసీఏ/బీఎస్సీ/బీకాం/బీఏ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ స్థాయిలో మేథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. మిగిలిన ప్రోగ్రామ్‌లకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అప్లయ్ చేసుకోవచ్చు.
అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ కోర్సులు
ఈ కేటగిరీలో బీకాం, బీఏ, ఎంకాం, ఎంఏ(ఎకనామిక్స్/పొలిటికల్ సైన్స్) ప్రోగ్రామ్‌లు ఉన్నాయి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.500(విదేశీయులకు 15 యూఎస్ డాలర్లు)
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 31
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in