తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రాక్‌ శాస్త్రీ ప్రోగ్రామ్‌.. సీట్లు ఎన్నంటే..!

ABN , First Publish Date - 2023-05-05T13:13:36+05:30 IST

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం- ప్రాక్‌ శాస్త్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇది ప్రీ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌.

తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రాక్‌ శాస్త్రీ ప్రోగ్రామ్‌.. సీట్లు ఎన్నంటే..!
Sanskrit University

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం- ప్రాక్‌ శాస్త్రీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇది ప్రీ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌. దీని వ్యవధి రెండేళ్లు. గరిష్ఠంగా నాలుగేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో సంస్కృత భాషకు సంబంధించిన ప్రాథమిక అంశాలు బోధిస్తారు. అభ్యర్థుల ప్రతిభను అనుసరించి నిబంధనల మేరకు స్కాలర్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తారు. మహిళలకు, పురుషులకు విడివిడిగా హాస్టల్స్‌ ఉన్నాయి.

సీట్ల వివరాలు: మొత్తం 132 సీట్లు ఉన్నాయి. జనరల్‌ అభ్యర్థులకు 61, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 12, ఓబీసీ అభ్యర్థులకు 32, ఎస్సీ అభ్యర్థులకు 18, ఎస్టీ అభ్యర్థులకు 9 సీట్లు ప్రత్యేకించారు.

ప్రోగ్రామ్‌ వివరాలు

  • మొదటి ఏడాది ఫస్ట్‌ లాంగ్వేజ్‌ కింద ఇంగ్లీష్‌, సెకండ్‌ లాంగ్వేజ్‌ కింద సంస్కృతం/ తెలుగు/ హిందీ పేపర్లు; మూడు సంస్కృతం పేపర్లు; మేథమెటిక్స్‌ 1ఎ, 1బి/యోగా అండ్‌ మెడిటేషన్‌ /హిస్టరీ; కంప్యూటర్స్‌ పేపర్లు ఉంటాయి.

  • రెండో ఏడాది ఇంగ్లీష్‌, సంస్కృతం/ తెలుగు/ హిందీ, సాహిత్యం/ వ్యాకరణం/ జ్యోతిషం/న్యా యం/ అద్వైత వేదాంతం/విశిష్ఠాద్వైత వేదాం తం/ ద్వైత వేదాంతం, రెండు సంస్కృతం పేపర్లు, మేథమెటిక్స్‌ 2ఎ అండ్‌ 2బీ/ యోగా అండ్‌ మెడిటేషన్‌/ హిస్టరీ, కంప్యూటర్స్‌ పేపర్లు ఉంటాయి.

  • సంప్రదాయ కోర్సులను సంస్కృతంలో, మోడ్రన్‌ సబ్జెక్టులను ఇంగ్లీ్‌షలో, లాంగ్వేజ్‌ సబ్జెక్టులను ఆ భాషల్లో బోధిస్తారు. కనీసం 75 శాతం అటెండెన్స్‌ తప్పనిసరి.

అర్హత: ఎస్‌ఎ్‌ససీ/ సీబీఎ్‌సఈ నుంచి పదోతరగతి ఉత్తీర్ణులు; న్యూఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్‌ నుంచి పూర్వ మాధ్యమ పూర్తిచేసినవారు; వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌(ఏపీ/ తెలంగాణ) ఉత్తీర్ణులు; మహర్షి సాందీపని రాష్ట్రీయ వేద విద్యా ప్రతిష్ఠాన్‌ నుంచి వేద భూషణ్‌ సర్టిఫికెట్‌ పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతిలో సంస్కృతం ఒక సబ్జెక్ట్‌గా చదివినవారికి; ఎన్‌ఎ్‌సయూ నుంచి సంస్కృతంలో సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ పూర్తిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థుల వయసు ఆగస్టు 15 నాటికి 15 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.300

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 22

వెబ్‌సైట్‌: nsktu.ac.in

Updated Date - 2023-05-05T13:13:36+05:30 IST