Telangana EdCET Results: ఎడ్‌సెట్ ఫలితాలు వచ్చేశాయ్..!
ABN , First Publish Date - 2023-06-12T17:08:38+05:30 IST
తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు
హైదరాబాద్: తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి (Telangana EdCET Results). ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. ఫలితాలు https://edcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 18న ఈ ఎడ్‌సెట్ నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 98.18 శాతంతో 26,994 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. తాండూరుకు చెందిన జి.వినీష తొలి ర్యాంకు సాధించగా.. హైదరాబాద్‌కు చెందిన నీశా కుమారి రెండో ర్యాంకుతో సాధించింది.