Share News

Telangana elections 2023: ఓటరు లిస్టులో మీ పేరు ఉందో.. లేదో.. ఎస్ఎంఎస్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి..

ABN , First Publish Date - 2023-11-28T12:50:06+05:30 IST

Voter List: ఓటు వేసేందుకు తాము అర్హులమా? కాదా? ఓటరు జాబితాలో తమ పేరు ఉందా? లేదా? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికి కావాల్సింది ఓటర్ల వ్యక్తిగత EPIC నంబర్.

Telangana elections 2023: ఓటరు లిస్టులో మీ పేరు ఉందో.. లేదో.. ఎస్ఎంఎస్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి..

Voter List: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలలో ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతాయి. ఇక ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఓటు వేసేందుకు తాము అర్హులమా? కాదా? ఓటరు జాబితాలో తమ పేరు ఉందా? లేదా? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికి కావాల్సింది ఓటర్ల వ్యక్తిగత EPIC నంబర్. ఓటర్లందరికీ భారత ఎన్నికల సంఘం ఎలక్టర్స్ ఫోటో గుర్తింపు కార్డు లేదా EPIC నంబర్‌ను జారీ చేస్తుందనే విషయం తెలిసిందే. దీని ద్వారా మనం చాలా సింపుల్‌గా ఓటరు లిస్టులో మన పేరు ఉందో.. లేదో తెలుసుకోవచ్చు. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఎస్ఎంఎస్, రెండోది ఈసీ హెల్ప్‌లైన్ నంబర్.

ఎస్ఎంఎస్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి..!

* దీని కోసం మీరు మీ ఫోన్ నుండి టెక్స్ట్ సందేశాన్ని పంపాల్సి ఉంటుంది.

* ముందుగా EPIC ఓటర్ ఐడీ నంబర్ నోట్ చేసుకుని పెట్టుకోవాలి.

* ఈ EPIC voter ID number‌ను సందేశం రూపంలో 1950కి పంపించాలి.

* దీని తర్వాత మీ నంబర్‌కు ఓ మెసేజ్ వస్తుంది. అందులో మీ పోలింగ్ బూత్ నంబర్, పేరు ఉంటాయి.

* ఒకవేళ ఓటరు జాబితాలో మీ పేరు లేకుంటే మీకు ఎలాంటి సమాచారం రాదు.

హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ఓటరు జాబితాలో పేరును ఎలా తనిఖీ చేయాలంటే..?

ఓటరు జాబితాలో మీ పేరును తనిఖీ చేయడానికి మీరు భారత ఎన్నికల సంఘం టోల్-ఫ్రీ నంబర్‌ 1950కు కాల్ చేయాల్సి ఉంటుంది. దీని కంటే ముందు మీ EPIC ఓటర్ ఐడీ నంబర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. ఆ తర్వాత కింది స్టేప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

* ముందుగా మీ ఫోన్‌ నుంచి 1950కి డయల్ చేయాలి.

* ఆ తర్వాత IVR (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) ప్రకారం మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి.

* అనంతరం ప్రాంప్ట్ కాల్‌ను అనుసరించి 'ఓటర్ ఐడీ స్టేటస్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడే మన EPIC ఓటర్ ఐడీ నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

* అలా EPIC ఓటర్ ఐడీ నంబర్‌ ఇచ్చిన తర్వాత మన ఐడీ స్టేటస్ ఏంటనేది తెలుస్తుంది.

Updated Date - 2023-11-28T13:17:15+05:30 IST