Amla: ఆ రోగాలకు మాత్రం దివ్యౌషధమే..!

ABN , First Publish Date - 2023-06-08T14:36:44+05:30 IST

సిట్రస్‌ ఫ్రూట్‌లో రారాజు ఉసిరి చలికాలంలో అధికంగా లభించే ఉసిరి ప్రస్తుతం అన్ని కాలాలలో లభిస్తుంది. ఈ ఉసిరి ఆరోగ్యానికి దివ్యౌషధంగా

Amla: ఆ రోగాలకు మాత్రం దివ్యౌషధమే..!
Amla

సిట్రస్‌ ఫ్రూట్‌లో రారాజు ఉసిరి చలికాలంలో అధికంగా లభించే ఉసిరి ప్రస్తుతం అన్ని కాలాలలో లభిస్తుంది. ఈ ఉసిరి ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ ఉసిరి తినాల్సిందే. ఎందుకంటే ఉసిరిలో విటమిన్‌ సి అధికంగా లభిస్తుంది. దీనితో పాటు ఐరన్‌, కాల్షియం, పాస్ఫరస్‌ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పచ్చడి, మురబ్బా, క్యాండీ జ్యూస్‌... ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. ఉసిరి కాయలు నేరుగా కూడా తినొచ్చు. డ్రైఆమ్లా క్యాండీలూ చప్పరించొచ్చు.

  • గొంతు మంట, జలుబుతో బాధపడేవారు 2 టీస్పూన్ల ఉసిరిపొడి, 2 టీస్పూన్ల తేనె కలిపి తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

  • ఇందులో పీచుపదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది.

  • రోజూ పరగడుపున ఉసిరి రసం పుక్కిలించడం ద్వారా నోటిలో వచ్చే పుండ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గుకు సమస్యలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

  • ఆర్థరైటిస్‌ వంటి కీళ్లనొప్పుల నివారణకు ఎండు ఉసిరి ఉపయోగపడుతుంది.

  • రోజువారీ ఆహారంలో ఉసిరి ఉండేలా చూసుకుంటే బరువు తగ్గడంతో పాటు జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.

  • దీనిలో ఉండే ఔషధ గుణాల వల్ల ఇది సహజసిద్ధమైన కండిషనర్‌గా పనిచేస్తుంది. ఉసిరి నూనె వాడకం జుట్టు తెల్లబడటాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యవంతమైన కేశసంపదను అందిస్తుంది. కుదుళ్లకు తగిన బలాన్నిచ్చి జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది.

  • తరచూ ఉసిరిని ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మానికి మంచి మెరుపు వస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు బ్లడ్‌ షుగర్‌ను అదుపులో ఉంచుతుంది.

  • ఉసిరి రసం రోజూ తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ర్టాల్‌ స్థాయిలు తగ్గి, గుండె పనితీరు మెరుగుపడుతుంది. శరీరం నుంచి చెడు టాక్సిన్లను బయటకు పంపడానికి ఉసిరి రసం సహాయపడుతుంది.

(హైదరాబాద్, నార్సింగ్‌ - ఆంధ్రజ్యోతి)

Updated Date - 2023-06-08T14:36:44+05:30 IST