ఈ జబ్బులు ఉన్న వారికి సూపర్ ఔషధం!

ABN , First Publish Date - 2023-05-15T12:35:58+05:30 IST

ఏ సీజన్‌లో వచ్చే పండును ఆ సీజన్‌లో తినాలంటారు పెద్దలు ఎందుకంటే మన శరీరానికి మినరల్స్‌, విటమిన్స్‌, కార్పొహైడ్రేట్‌లు, ప్రొటిన్స్‌ అన్ని కావాలి. ఒక్కో పండులో ఒక్కో

ఈ జబ్బులు ఉన్న వారికి సూపర్ ఔషధం!
good medicine

ప్రస్తుత సీజన్‌లో విరివిగా పండ్లు

రోడ్ల పక్కన జోరుగా విక్రయాలు

మధుమేహ బాధితులకు మంచి ఔషధం

ఏ సీజన్‌లో వచ్చే పండును ఆ సీజన్‌లో తినాలంటారు పెద్దలు ఎందుకంటే మన శరీరానికి మినరల్స్‌, విటమిన్స్‌, కార్పొహైడ్రేట్‌లు, ప్రొటిన్స్‌ అన్ని కావాలి. ఒక్కో పండులో ఒక్కో గుణం ఉంటుంది. కాబట్టి ఆ సీజన్‌లో వచ్చే పండును ఆ సీజన్‌లో తినాలని చెబుతారు. మరి ప్రస్తుతం అల్లనేరేడు పండ్ల సీజన్‌. ప్రస్తుతం నగరంలో బాగానే విక్రయాలు బాగానే సాగుతున్నాయి. నగరంలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పెట్టి విక్రయిస్తున్నారు. లంగర్‌హౌజ్‌ నుంచి బండ్లగూడ రోడ్డులో రోడ్డుకు ఇరువైపులా పెట్టి విక్రయిస్తున్నారు. ఇక మెహిదీపట్నంలో చెప్పనక్కరలేదు, చాలా తోపుడు బండ్లపై ఈ అల్లనేరేడు పండ్లు విక్రయిస్తున్నారు. నార్సింగ్‌, గోల్కొండ, షేక్‌పేట నాల, రోడ్లపై చిరువ్యాపారులు వీటిని విక్రయానికి ఉంచారు . నగరంలోని ప్రధాన మార్కెట్‌లతోపాటు గుడిమల్కాపూర్‌ మార్కెట్‌, మెహిదీపట్నం మార్కెట్‌ శంషాబాద్‌ మార్కెట్‌లో ఈ అల్లనేరేడు పండ్లు భారీగా, హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. నాణ్యతను బట్టి ఒక్కో బుట్ట రూ.1000 నుంచి రూ. 1200ల వరకు ధర పలుకుతుంది. ఒక్కోసారి డిమాండ్‌ను బట్టి రూ.1500ల వరకు ధర లభిస్తుంది. శంషాబాద్‌, షాబాద్‌, షాద్‌నగర్‌, బాలానగర్‌, వికారబాద్‌, చేవెళ్ల శంకర్‌పల్లి మొమిన్‌పేట తదితర మండలాల నుంచి వచ్చే రైతులు, చిరు వ్యాపారులు ఈ పండ్లను అక్కడ సేకరించి నగరంలోని మార్కెట్‌లకు తీసుకువస్తున్నారు. మార్కెట్‌లో ఈ పండ్లకు ధర ప్రోత్సాహకంగానే ఉంది. ప్రస్తుతం వీటి ధర కిలో రూ. 120 నుంచి రూ.200 పలుకుతుంది.

నగరంలోని రోడ్లపై ఫుట్‌పాత్‌లపై విక్రయాలు చేస్తున్న గ్రామీణ మహిళలు అల్లనేరేడు పండ్ల అమ్మకం ద్వారా రోజుకు రూ.1000 నుంచి రూ.1500ల వరకు ఆదాయం పొందుతున్నారు. ఈ పండ్ల సిజన్‌ నెలరోజులే. ఈ కాలంలో అన్ని ఖర్చులు పోనూ రూ. 20వేల నుంచి రూ.25వేలు వరకు సంపాదిస్తారు.

మధుమేహ బాధితుల సంఖ్య అత్యధికంగా ఉండడంతో ఈ పండ్లకు గిరాకీ రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఈ పండ్లకు నగరంలో ఆదరణ పెరుగుతుండడంతో చాలా మంది రైతులు వీటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు.

పోషకాల గని...

  • అన్ని పండ్లలాగానే అల్లనేరేడులో కూడా పోషకాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు, ఎంజైములు మెండుగా ఉంటాయి.

  • మధుమేహం అదుపులో ఉంచుతుంది.

  • ఉబకాయం తగ్గిస్తుంది. అతిసార, స్ర్తీలలో నెలసరి సమస్యలు, జననేంద్రియ సమస్యలు తొలగుతాయి.

  • రక్తపోటు అదుపులో ఉంటుంది.

  • గుండె జబ్బులు దరిచేరవు,

  • ఉదరకోశ వ్యాధుల నివారణకు ఈ పండ్లు ఎంతగానో ఉపయోగపడుతాయి.

-నార్సింగ్‌, హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి)dld.jpg

Updated Date - 2023-05-15T12:37:27+05:30 IST