Coconut oil: నూనె రాసుకొని నిద్రపోతున్నారా? అయితే ఈ విషయం తెలియాల్సిందే!
ABN , First Publish Date - 2023-09-27T11:35:19+05:30 IST
నూనె రాసుకొని- రాత్రంతా వదిలేస్తే ఏమవుతుంది? జుట్టు నిగనిగలాడిపోతుందా? నిగనిగలాడదు సరికదా సమస్యలు ఎదురవుతాయంటున్నారు సౌందర్యనిపుణులు. నూనె రాసుకొనే విషయంలో వారేమంటున్నారో చూద్దాం..
నూనె రాసుకొని- రాత్రంతా వదిలేస్తే ఏమవుతుంది? జుట్టు నిగనిగలాడిపోతుందా? నిగనిగలాడదు సరికదా సమస్యలు ఎదురవుతాయంటున్నారు సౌందర్యనిపుణులు. నూనె రాసుకొనే విషయంలో వారేమంటున్నారో చూద్దాం..
కొబ్బరి నూనె, ఆల్మండ్ నూనెలలో ఫ్యాటీ యాసిడ్స్, ట్రైగ్లిజరేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వాటితే జుట్టుకు మెరుపు వస్తుంది.
కొబ్బరినూనె వంటి వాటిలో విటమిన్ సి..ఈలు ఉంటాయి. ఇవి వాతావరణం వల్ల జుట్టుకు కలిగే ఇబ్బందులను సరిచేయటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
నూనెను తలకు రాసి మర్దనా చేయటం వల్ల తల పైభాగంలో రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తప్రసరణ పెరగటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
నూనె రాసుకొని నిద్రపోతే..?
తలపై చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటి నుంచి జుట్టు పెరుగుతుంది. తలకు నూనె రాసుకొని ఎక్కువ సేపు వదిలేస్తే ఈ రంధ్రాలు పూడుకుపోతాయి. కొన్ని సార్లు చిన్న చిన్న పొక్కులు కూడా వస్తాయి. అందువల్ల నూనె రాసుకొన్న కొద్ది సేపటికే జుట్టును శుభ్రం చేసుకోవాలి.
నూనెను రాసుకొని ఎక్కువ సేపు వదిలేస్తే- సేబోర్హిక్ డెర్మేటిటిస్ అనే సమస్య ఏర్పడవచ్చు. దీని వల్ల తలపై చుండ్రు మాదిరిగా పచ్చటి రేణువులు వస్తాయి. కొందరికి తల మీదే కాకుండా కనుబొమ్మలు, చెవులలో కూడా ఈ రేణువులు ఏర్పడతాయి.
నూనె కారడం వల్ల ముఖంపై చర్మం బీటలు వారిపోతుంది. అందువల్ల జుట్టుకు నూనె రాసుకున్న 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.