Bone Health: ఎముకల ధృడత్వం తగ్గుతుందా? అయితే వెంటనే..!

ABN , First Publish Date - 2023-08-23T11:19:05+05:30 IST

ఆరోగ్యకరమైన జీవన విధానం అవలంభించాలంటే ఎముకలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. వయస్సు మీద పడుతున్న కొలది ఎముకల ధృడత్వం తగ్గుతుంది. అయితే కొద్ది మందిలో రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల ఎముకలు ముందే గుల్లబారుతూ ఉంటాయి.

Bone Health: ఎముకల ధృడత్వం తగ్గుతుందా? అయితే వెంటనే..!

ఆరోగ్యకరమైన జీవన విధానం అవలంభించాలంటే ఎముకలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. వయస్సు మీద పడుతున్న కొలది ఎముకల ధృడత్వం తగ్గుతుంది. అయితే కొద్ది మందిలో రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల ఎముకలు ముందే గుల్లబారుతూ ఉంటాయి. ఈ లక్షణాలను మన శరీరం చెప్పకనే చెబుతూ ఉంటుంది. ఆ లక్షణాలేమిటో చూద్దాం..

తరచూ గాయలు...

కొందరికి చిన్న చిన్న గాయాలైనా - ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. ఎముకలు విరిగిపోవటమే కాదు.. విరిగిన ఎముకలు తిరిగి అతుక్కొవటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు డాక్టర్‌కు తప్పనిసరిగా చూపించాలి.

వంగిపోతే...

కొందరు నిటారుగా నిలబడలేరు. దీనికి కారణం ఎముకల్లో సాంద్రత లేకపోవటం. ఎముకల సాంద్రత తగ్గిన కొలది.. నిటారుగా నిలబడలేరు. దీని వల్ల ముందుకు వంగుతారు. పొట్టిగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఎదురయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

బలహీనమైన గోళ్లు...

గోళ్లు బలహీనంగా ఉన్నా.. తరచూ విరిగిపోతున్నా- ఎముకలలో బలం లేనట్లే లెక్క! విటమిన్‌ డీ, కాల్షియం సరిగ్గా లేకపోతే గోళ్లు బలహీనపడతాయి. గోళ్లు బలహీనంగా ఉన్నాయంటే ఎముకలు కూడా బలహీనంగా ఉన్నట్లే! అలాంటప్పుడు డాక్టర్‌కు తప్పనిసరిగా చూపించుకోవాలి.

పట్టుజారి పోతే...

కొన్ని సార్లు చేతి పట్టు తప్పి.. ఏదైనా పట్టుకున్నప్పుడు కిందకు జారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎముకలు బలహీనపడ్డాయని గమనించి డాక్టర్‌కు వెంటనే చూపించటం మంచిది.

Updated Date - 2023-08-23T11:19:05+05:30 IST