Coriander: టేస్ట్ కోసం కాదు.. ఎన్ని పోషకాలున్నాయో తెలుసా!
ABN , First Publish Date - 2023-03-01T12:01:02+05:30 IST
నిత్యం కొత్తిమీర (Coriander) వంటల్లో సువానకోసం వేస్తారని అనుకోవద్దు. కొత్తిమీరలో అనేక పోషక విలువలు ఉన్నాయి. కొత్తమీర వంటకాల్లో పడితే వచ్చే టేస్టే వేరు. ఇందులో
నిత్యం కొత్తిమీర (Coriander) వంటల్లో సువానకోసం వేస్తారని అనుకోవద్దు. కొత్తిమీరలో అనేక పోషక విలువలు ఉన్నాయి. కొత్తమీర వంటకాల్లో పడితే వచ్చే టేస్టే వేరు. ఇందులో ఆరోగ్యాన్ని (Health) కాపాడే బహుమంచి గుణాలు కూడా ఉన్నాయి. ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా కొత్తిమీర వాడుతుంటారు. వేల సంవత్సరాల క్రితమే దీనిని మధ్యదరా ప్రాంతాల్లో పెంచేవారు. కాలక్రమేణా ప్రపంచమంతటా దీనిని వినియోగించడం మొదలు పెట్టారు. ఇది సుమారు రెండు అడుగుల ఎత్తు పెరుగుతుంది. విలక్షణమైన సువాసన కలిగి ఉంటుంది. తెలుపు లేదా లేత గులాబి వర్ణం పూలనిస్తుంది. దీని ఆకులు, గింజలను మసాలాగా వాడతారు. వీటిలో ఉన్న ఎసెన్షియల్ తైలాలైన కొరియాండరాల్ లాంటి ఆల్ డీహైడ్లు, టర్పీన్లు వినాయీల్, పైనీన్ కొరియాండర్‌లకు ప్రత్యేక సువాసనలుంటాయి. అప్పుడే తీసిన ఆకులు, తయారు చేసిన గింజల పౌడర్ కూడా బాగా సువాసనగా ఉంటుంది. దీంతో పాటు ప్రొటీన్లు, విటమిన్లు, లవణాలు, లోహాలు కొత్తిమీరలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో పీచుపదార్థం కూడా ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. థాయ్ వంటకాల్లో దీనిని ఎక్కువగా వాడుతుంటారు.
బహుళ ప్రయోజనాలు
కొత్తమీర త్రిదోషాలను హరిస్తుంది.
ఉదర సమస్యలను నివారిస్తుంది.
జఠర రసములను ఉత్పత్తి చేసి, జీర్ణశక్తిని పెంచి, ఆకలిని కలిగిస్తుంది. పైత్య రసంను తగ్గించి మేహశాంతినిస్తుంది.
విషపూరిత ఆహారపదార్థాల దుష్ప్రభావాలను నివారిస్తుంది.
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్‌గా పనిచేయడం ద్వారా జ్వరాల నివారణకు, ఆహార పదార్థాల ప్రిజర్వేటివ్‌గా ఉపయోగపడుతుంది.
టానిక్‌లాగా పనిచేసి ఉత్సాహాన్నిచ్చి లైంగిక పటిష్టతనుకలుగజేస్తుంది.
జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తి కానివ్వదు. సులభంగా మూత్ర విసర్జన జరిగేట్టు చేసి కిడ్నీల ఆరోగ్యానికి దోహదపడుతుంది.
కొత్తిమీర జ్యూస్ తీసుకోవడంవల్ల విటమిన్ ఎ, బి-1, బి-2, సి లభిస్తాయి. ఐరన్ లోపాలతో బాధపడుతున్న వారు ఈ సమస్యను అధిగమించటానికి కొత్తిమీర మంచి ఔషధం.
ఫ్లావోనాయిడ్లు లాంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉండటం వల్ల ఇది శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
కొత్తిమీర టీ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్, ఇతర లిపిడ్స్ తగ్గుతాయి. యువతలో హార్మోనల్ సమతుల్యతను కాపాడుతుంది.
నోటి దుర్వాసనను నివారించడమే కాకుండా దీని తైలాలు పెర్ఫ్యూంలలో, జిన్ లాంటి ఆల్కాహాల్ పానీయాలలో వాడతారు.
కొత్తిమీరతో వంటింటి అవసరాలు ఎన్నో చెప్పక్కర్లేదు. దీనిని చట్నీలు, సలాడ్స్, సూపులలో వినియోగిస్తారు. గార్నిషింగ్ హెర్బ్‌గా కూడా కొత్తిమీరని ఉపయోగిస్తారు.
-నార్సింగ్(హైదరాబాద్) - ఆంధ్రజ్యోతి)