Hair tips: పెరుగుతో జుట్టు రాలకుండా చేయొచ్చు..! అదెలా అంటే..!
ABN , First Publish Date - 2023-05-03T11:04:01+05:30 IST
పెరుగు తింటే చలువదనం. పైగా బాగా నిద్రపడుతుంది. అయితే ఈ పెరుగుతో జుట్టు ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. జుట్టు రాలటం, చుండ్రులాంటి సమస్యలను దూరం
పెరుగు తింటే చలువదనం. పైగా బాగా నిద్రపడుతుంది. అయితే ఈ పెరుగుతో జుట్టు ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. జుట్టు రాలటం, చుండ్రులాంటి సమస్యలను దూరం చేయవచ్చు. పెరుగుతో చేసుకునే హెయిర్ మాస్కులేంటో తెల్సుకుందాం.
కప్పు పెరుగు తీసుకుని అందులో నాలుగు స్పూన్ల నిమ్మరసంతో పాటు నాలుగైదు చుక్కల కొబ్బరినూనె వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టు కుదుళ్లకు పట్టేట్లు పట్టించాలి. ఇరవై నిముషాల పాటు ఆరబెట్టి కడిగేయాలి. దీని వల్ల జుట్టు వత్తుగా పెరగటంతో పాటు చుండ్రు సమస్య తగ్గిపోతుం
కప్పు పెరుగులో కోడిగుడ్డు సొన వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత జుట్టుకు పట్టించాలి. అరగంట పాటు అలానే వదిలేశాక.. చన్నీళ్లతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల జుట్టులో మెరుపు వస్తుంది, ఆరోగ్యమైన జుట్టు మీ సొంతం అవుతుంది.
కప్పు పెరుగులోకి బాగా పండిన అరటిపండును కట్ చేసి వేసిన తర్వాత మిశ్రమాన్ని మెత్తగా కలపాలి. దీనికి నాలుగైదు చుక్కల ఆలివ్ నూనెను జతచేయాలి. జుట్టుకు పట్టించి వైడ్ టూత్ దువ్వెనతో దువ్వుకోవాలి. ఈ మిశ్రమం జుట్టుకు పట్టేంత వరకూ ఆరబెట్టుకోవాలి. కనీసం అరగంట అలా ఉంచుకోవాలి. ఇలా చేస్తే వెంట్రుకలు ఊడిపోయే సమస్య ఉండదు. మరింత గట్టిగా కుదుళ్లు ఉంటాయి.
కప్పు పెరుగుతోకి టేబుల్ స్పూన్ తేనె కలపాలి. దీనికి కొద్దిగా యాపిల్ సిడార్ వెనిగర్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత జుట్టుకు పట్టించి షాంపూతో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల జుట్టు గట్టిగా ఉంటుంది.
కప్పు పెరుగులోకి రెండు టేబుల్ స్పూన్ల అలొవెరా జెల్‌ను వేయాలి. మిశ్రమంగా కలిపిన తర్వాత ఆ పేస్ట్‌ను జుట్టు కుదుళ్లు తగిలేవరకూ పట్టిస్తే ఇచ్చింగ్ సమస్యరాదు. దీనికి తోడు జుట్టు పెరుగుతుంది.