date palm: ఉదయాన్నే ఖర్జూరం తింటే ఎన్ని ఉపయోగాలో..!
ABN , First Publish Date - 2023-08-08T15:13:19+05:30 IST
ఖర్జూరం బలవర్థకమైన ఆహారమనే విషయం మనందరికీ తెలిసిందే! అయితే ఈ పండులోని పోషకాల నుంచి పరిపూర్ణ లాభం పొందాలంటే, వాటిని ఉదయాన్నే తినడం అలవాటు చేసుకోవాలి.
ఖర్జూరం బలవర్థకమైన ఆహారమనే విషయం మనందరికీ తెలిసిందే! అయితే ఈ పండులోని పోషకాల నుంచి పరిపూర్ణ లాభం పొందాలంటే, వాటిని ఉదయాన్నే తినడం అలవాటు చేసుకోవాలి.
ఐరన్: ఖర్చూరాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అనీమియాను నివరించడంతో పాటు, శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉండాలంటే ఖర్జూరాలు తింటూ ఉండాలి.
అలసట: పొద్దునే ఆవరించే అలసట, నిస్సత్తువలు దూరం కావాలంటే ఉదయాన్నే ఖర్జూరాలు తినాలి.
పోషకాలు: ఖర్జూరాల్లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి వీటితో ఫలితం ఉంటుంది.
ఎముకలు దృఢం: ఖర్జూరాల్లో విటమిన్ సితో పాటు, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్ లాంటి ఎముకల దృఢత్వానికి తోడ్పడే పోషకాలన్నీ ఉంటాయి.
చెడు కొలెస్ట్రాల్: ఖర్జూరాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మోతాదును తగ్గించడం ద్వారా గుండెకు రక్షణ కల్పిస్తాయి.