Diabetes: మధుమేహం ఉన్నవారు వాటితోనూ జాగ్రత్తగా ఉండాలి
ABN , First Publish Date - 2023-05-23T12:08:21+05:30 IST
మధుమేహంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే ఆరోగ్య సమస్యలు కొన్నైతే, పరోక్ష సంబంధ కలిగి ఉండే ఇబ్బందులు మరికొన్ని. ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న
మధుమేహంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే ఆరోగ్య సమస్యలు కొన్నైతే, పరోక్ష సంబంధ కలిగి ఉండే ఇబ్బందులు మరికొన్ని. ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న రుగ్మతలన్నీ మధుమేహం అదుపు తప్పిన వెంటనే బయల్పడుతూ ఉంటాయి. పరోక్ష సంబంధం కలిగిన సమస్యలు మధుమేహుల్లో చక్కెర అదుపులో ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో బహిర్గతమవుతూ ఉంటాయి. అవేంటంటే...
రక్తపోటు, అల్జీమర్స్, డిప్రెషన్
మధుమేహానికి రక్తపోటు సోదరి లాంటిది. ఈ రెండిటికీ అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి మధుమేహులు క్రమం తప్పకుండా రక్తపోటును పరీక్షించుకుంటూ ఉండాలి. అలాగే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి. కొన్ని ఆరోగ్య సమస్యలకు మధుమేహంతో సంబంధం ఉంటున్నట్టు తేలింది. వాటిలో అల్జీమర్స్, డిప్రెషన్, వినికిడి తగ్గటం, ఫ్యాటీ లివర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఎముకలు విరగడం చెప్పుకోదగినవి.
క్రమం తప్పకుండా పరీక్షలు!
సంవత్సరానికోసారి మధుమేహులు ఈ పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలి.
రెటీనోపతి: కళ్లను పరీక్షించి తేలికగా కనిపెట్టగలిగే సమస్య ఇది.
యూరినరీ మైక్రో ఆల్‌బ్యుమిన్: మూత్రంలో ప్రొటీన్లు పోతున్నాయేమో కనిపెట్టే పరీక్ష.
క్రియాటినిన్: మూత్రపిండాల పనితీరును కనిపెట్టే పరీక్ష
రక్త పరీక్ష: రక్తంలో కొలెస్ట్రాల్ శాతం కనిపెట్టే పరీక్ష
సిటి కొరొనరీ యాంజియోగ్రామ్: ఈసీజీతోపాటు అవసరమైతే ఈ పరీక్ష చేయించుకోవాలి.
అల్ట్రా సౌండ్: ఫ్యాటీ లివర్ కనిపెట్టడం కోసం చేసే పరీక్ష
చెవి పరీక్ష: వినికిడి తగ్గితే ఈ పరీక్ష చేయించుకోవాలి
డయాబెటిక్ ఫుట్: మధుమేహ వైద్యుల్ని కలిసిన ప్రతిసారీ కాళ్లు, పాదాలు పరీక్ష చేయించాలి. చర్మం, దాని రంగు, చర్మం పైను ఉండే వెంట్రుకలు, కాలి వేళ్ల మధ్య సందులను పరీక్షించి సమస్యను ముందుగానే గుర్తించవచ్చు.