Healthy food: వానాకాలంలో రోగాలు దరిచేరకుండా ఉండాలంటే..!

ABN , First Publish Date - 2023-07-20T11:26:29+05:30 IST

వానలొచ్చాయంటే వాతావరణంలో చల్లదనమే కాదు.. ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తాయి. జీర్ణసమస్యలు, దగ్గు, జలుబు ఈ సీజన్‌లో సులువుగా వస్తాయి. వానాకాలాన్ని ఎంజాయ్‌ చేయటమే కాదు.. హెల్తీ డైట్‌ కూడా అవసరం.

Healthy food: వానాకాలంలో రోగాలు దరిచేరకుండా ఉండాలంటే..!

వానలొచ్చాయంటే వాతావరణంలో చల్లదనమే కాదు.. ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తాయి. జీర్ణసమస్యలు, దగ్గు, జలుబు ఈ సీజన్‌లో సులువుగా వస్తాయి. వానాకాలాన్ని ఎంజాయ్‌ చేయటమే కాదు.. హెల్తీ డైట్‌ కూడా అవసరం.

  • ప్రొటీన్లు అధికంగా ఉండే నానబెట్టిన గింజల్ని తినాలి. బ్రేక్‌ఫాస్ట్‌ లేదా స్నాక్స్‌ సమయంలో వీటిని తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

  • ఈ కాలంలో పసుపు గొప్ప ఔషధం. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండే ఈ పసుపు వల్ల అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. అందుకే గోరువెచ్చని నీళ్లలోనో, పాలల్లోనో మంచి పసుపు కలిపి నిద్రపోయే ముందు తాగితే చక్కని ఫలితం ఉంటుంది.

  • విటమిన్‌-సి ఎక్కువగా ఉండే నిమ్మరసం తీసుకోవటం మంచిదే. సాధారణంగా ఎండాకాలం నిమ్మరసాన్ని తాగుతారు. అలాగే మాన్‌సూన్‌లోనూ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఇది ఉపకరిస్తుంది.

  • బాదం, పిస్తా, జీడిపప్పు లాంటి బలవర్ధకమైన నట్స్‌ను ఈ కాలంలో తినాలి. సులువుగా జీర్ణం అవ్వటంతో పాటు బలాన్ని, ఇమ్యూనిటీ పవర్‌ను ఇస్తాయవి.

  • ఈ కాలంలో చిరుతిండ్లకు బంద్‌ చెప్పటం మంచిదే. వెజిటేబుల్‌ సూప్‌, చికెన్‌ సూప్‌లాంటివి తాగటం వల్ల ఉపశమనంతో పాటు ఆరోగ్యానికీ మంచిదే.

  • హెర్బల్‌టీని ప్రిఫర్‌ చేయటం ఈ కాలంలో మరీ మంచిది.

  • తాజా కూరగాయలతో పాటు తాజా పండ్లను తినాలి. దీనివల్ల వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రావు.

  • మెంతిపప్పు, మెంతికూర తింటే శరీరానికి బూస్టర్‌లా పని చేస్తుంది.

  • కోడిగుడ్డుతో పాటు ఒమేగా ఫాటీ యాసిడ్స్‌ ఉండే చేపలను తినటం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

  • అల్లంటీ, వెల్లుల్లి వేసిన ఆహారం తినటం వల్ల గొంతు ఇన్‌ఫెక్షన్లు, కడుపులో సమస్యలు పోతాయి.

  • అతిగా మసాలా ఉండే పదార్థాలు, ఎక్కువగా నాన్‌వెజ్‌ తినటం లాంటి ఈ కాలంలో మంచిది కాదు. దప్పిక తక్కువ ఉన్నా మంచి నీళ్లను బాగా తాగాలి. గోరువెచ్చని నీళ్లను తాగితే మరీ మంచిది.

Updated Date - 2023-07-20T11:26:29+05:30 IST