Weight: బరువు తగ్గట్లేదా? అయితే కారణమిదే..!
ABN , First Publish Date - 2023-07-26T12:50:10+05:30 IST
ఎంత కష్టపడి వ్యాయామాలు చేసినా బరువు (weight) తగ్గట్లేదని చిరాకుపడుతున్నారా? అయితే లోపం మీ ఆహారశైలిలో దాగి ఉందేమో గమనించండి. అస్తవ్యస్థ ఆహారశైలితో అదనపు క్యాలరీలు (Calories) శరీరంలో చేరుకుంటున్నంత కాలం ఎంత వ్యాయామం చేసినా ఫలితం దక్కదు.

క్యాలరీల లెక్క:
తీసుకుంటున్న క్యాలరీల కంటే ఎక్కువ క్యాలరీలు కరిగేలా వ్యాయామం చేయగలిగితేనే శరీర బరువు తగ్గుతుంది. కానీ తింటున్న పదార్థాల ద్వారా అందుతున్న క్యాలరీలను లెక్కించడంలో విఫలమై, వ్యాయామంతో బరువు తగ్గడం లేదని కంగారుపడుతూ ఉంటాం. కాబట్టి ఈ లెక్కను సరిచూసుకుంటూ, ఆహారం ద్వారా అందే క్యాలరీల మీద ఓ కన్నేసి ఉంచాలి.
బరువులు:
శరీర బరువు కరిగించడంలో వెయిట్ ట్రైనింగ్ ఎంతో ప్రభావవంతమైనది. కాబట్టి వారంలో మూడు నుంచి నాలుగు రోజులు వెయిట్ ట్రైనింగ్‌కు కేటాయించాలి. వ్యాయామం పూర్తయిన తర్వాత కండర నష్టం జరగకుండా ప్రొటీన్ తప్పనిసరిగా తీసుకోవాలి. క్వినోవాలో ప్రొటీన్లు అధికం. కాబట్టి ఆహారంలో క్వినోవాకు స్థానం కల్పించాలి.
కొవ్వులు:
నెయ్యి, కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్... ఇలాంటి మంచి కొవ్వులు తీసుకోవాలి. అవకాడొ తరచుగా తింటూ ఉండాలి.