Rains: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించండి!
ABN , First Publish Date - 2023-06-28T14:42:37+05:30 IST
వాతావరణం చల్లబడినపుడు దోమల సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే దోమ తెరలు వాడటం చేయాలి. దోమలు పెరగకుండా నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇల్లంతా తడిగా ఉంటే దోమలు వస్తాయని గుర్తుంచుకోండి. ఈ కాలంలో ముఖ్యంగా జలుబు, దగ్గు సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే కాస్త గోరు వెచ్చని నీళ్లను తాగితే మంచిది.
• వాతావరణం చల్లబడినపుడు దోమల సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే దోమ తెరలు వాడటం చేయాలి. దోమలు పెరగకుండా నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇల్లంతా తడిగా ఉంటే దోమలు వస్తాయని గుర్తుంచుకోండి. ఈ కాలంలో ముఖ్యంగా జలుబు, దగ్గు సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే కాస్త గోరు వెచ్చని నీళ్లను తాగితే మంచిది.
• మొలకెత్తిన గింజలు, నారింజ, తాజా కూరగాయలు, పండ్లు తినాలి. దీనివల్ల సివిటమిన్ లభిస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
• ఇంట్లో ఆహారానికి కాస్త గాలి తగిలేట్లు ఉంచండి. బయట బురద దగ్గర ఉండే షాపుల్లో ఆహారపదార్థాలు, జంక్ ఫుడ్ తినటం మానేయాలి. తాజా ఆహారాన్ని మాత్రమే తినాలి.
• ఇంట్లో బట్టలు ఒకే చోట వేయడం, తడిచిన బట్టలు కుప్పగా వేయటం వల్ల దోమల సమస్యతో పాటు బ్యాక్టీరియా సమస్య ఉత్పన్నమవుతుంది.
• పాల ఉత్పత్తులైన వెన్న, నెయ్యికి దూరంగా ఉండటం మంచిది. అయితే తాజా పెరుగును తింటే మంచిది. ఇక కారం ఉండే ఆహారాన్ని తినకూడదు. సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్నే తినాలి.
• వాతావరణం చల్లబడినపుడు వర్కవుట్స్ చేయటం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. ఇక హెర్బల్ టీ లాంటివి తాగటానికి ఆసక్తి చూపితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
• చేతుల్ని శుభ్రంగా కడిగి తినాలి. బయటకు వెళ్లేప్పుడు గొడుగులు, రెయిన్కోట్లు తీసుకెళ్లటం మంచిది.
• తడి బట్టలు, తడి షూస్, తడి తువాళ్లు వాడకపోవటమే మంచిది. ఎల్లప్పుడు పొడిగా ఉండే బట్టలను ఉపయోగించాలి.
• డస్ట్ జోలికి వెళ్లటం లాంటి పనులు చేయకూడదు. ఇతరులెవరైనా జ్వరాల బారిన పడితే దూరంగా ఉండటం మంచిది. లేకుంటే మీకూ ఆ సమస్య వస్తుంది.
• ఇంట్లో సింక్‌తో పాటు వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త ఉండకుండా చూసుకోవాలి.
• వానలు పడినప్పుడు ఇంట్లో కరెంటు కనెక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.