Hair: వానాకాలంలో కూడా జుట్టు మెరవాలంటే...

ABN , First Publish Date - 2023-07-19T12:57:05+05:30 IST

వానాకాలం వస్తే ఎప్పుడో ఒకప్పుడు జుట్టు తడవకుండా ఉండదు. ఇలా పదే పదే జరిగినప్పుడు జుట్టు పాడైపోతుంది. అలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు పాటించాలని సౌందర్య నిపుణులు పేర్కొంటున్నారు.

Hair: వానాకాలంలో కూడా జుట్టు మెరవాలంటే...

వానాకాలం వస్తే ఎప్పుడో ఒకప్పుడు జుట్టు తడవకుండా ఉండదు. ఇలా పదే పదే జరిగినప్పుడు జుట్టు పాడైపోతుంది. అలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు పాటించాలని సౌందర్య నిపుణులు పేర్కొంటున్నారు.

డీప్‌ కండిషనింగ్‌

జుట్టు తరచుగా తడుస్తూ ఉంటే- దానిలో ఉన్న తేమ తగ్గిపోయి.. పొడిబారిపోతుంది. అందువల్ల వారానికి ఒక సారి కండిషనర్‌ను ఉపయోగించి తలస్నానం చేయాలి. దీని వల్ల తేమ తగ్గిపోతే అది మళ్లీ పెరుగుతుంది.

ఆయిల్‌ మసాజ్‌

వారానికి ఒక సారి తల మాడు భాగాన్ని గోరువెచ్చని కొబ్బరినూనెతో మర్దనా చేయాలి. ఇలా చేయటం వల్ల రక్తప్రసరణ జరిగి జుట్టు మృదువుగా అవుతుంది.

వాన నుంచి రక్షణ

జుట్టును టోపి లేదా స్కార్ఫ్‌తో రక్షించుకోవాలి. దీని వల్ల వాతావరణంలో ఉన్న తేమ వల్ల జుట్టుకు ఇబ్బంది రాదు.

సాధనాలు వాడద్దు..

జుట్టు రింగులు తిరగకుండా చేసే స్ట్రెయిట్‌నర్స్‌ వంటి సాధనాలను వానాకాలం వాడకూడదు. వానాకాలం జుట్టు తరచు తడవటం వల్ల.. గాలిలో తేమ వల్ల పొడిగా మారుతుంది. ఈ సాధనాలను వాడితే మరిన్ని సమస్యలు ఏర్పడతాయి.

Updated Date - 2023-07-19T12:57:05+05:30 IST