Teeth: పళ్లు బలంగా లేవా? అయితే కారణమిదే..!
ABN , First Publish Date - 2023-09-07T12:56:10+05:30 IST
కొందరికి పళ్లు పుచ్చిపోతూ ఉంటాయి. మరి కొందరికి చిగుళ్లు ఎప్పుడూ వాచిపోతూ ఉంటాయి. సరైన ఆహారం తినకపోవటమే ఈ లక్షణాలకు కారణముంటున్నారు పౌష్టికాహార నిపుణులు.
కొందరికి పళ్లు పుచ్చిపోతూ ఉంటాయి. మరి కొందరికి చిగుళ్లు ఎప్పుడూ వాచిపోతూ ఉంటాయి. సరైన ఆహారం తినకపోవటమే ఈ లక్షణాలకు కారణముంటున్నారు పౌష్టికాహార నిపుణులు. పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తినాలో సూచిస్తున్నారు. వాటిలో కొన్ని...
కూరగాయలు, పళ్లలో ఫైబర్ ఉంటుంది. ఇది పళ్లపై ఉన్న బ్యాక్టీరియాను, పాచిని తొలగించటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు యాపిల్స్‌లో ఉండే మాలిక్ యాసిడ్- పళ్లపై పొరను శుభ్రం చేస్తుంది. అంతే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు.. ఇతర పోషకపదార్థాలు పళ్లను, చిగుళ్లను బలోపేతం చేస్తాయి.
పాలు, పెరుగు, చీజ్ వంటి పదార్థాల్లో కాల్షియం, పోస్పరస్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బలమైన పళ్లకు, చిగుళ్లకు మేలు చేస్తాయి.
చేపల్లో ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చిగుళ్లు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతూ ఉంటాయి.
డ్రై ఫ్రూట్స్‌లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వీటిలో ఉండే కాల్షియం, మెగ్నిషియం పళ్లు పాడుకాకుండా ఉపయోగిస్తాయి. అంతే కాకుండా ఇవి పళ్లపై బ్యాక్టీరియా చేరకుండా కాపాడతాయి.
ప్రతి రోజు ఆహారం తిన్న తర్వాత కొన్ని పదార్థాలు నోటిలో ఉండిపోతాయి. వీటిని వెంటనే శుభ్రం చేసుకోపోతే- రకరకాల సమస్యలు ఏర్పడతాయి. దీనితో పాటుగా తరచూ నీటిని తాగుతూ ఉంటే- నోటిలో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. ఇవి నోటిని శుభ్రం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
చూయింగ్ గమ్‌ను తినటం వల్ల కూడా లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అయితే చ్యూయింగ్ గమ్‌లలో చక్కెర ఉంటుంది. అందువల్ల సుగర్ ఫ్రీ చ్యూయింగ్ గమ్‌ను తినటం మంచిది.