Beauty: బొప్పాయిని వారానికోసారి ఇలా చేస్తే..!
ABN , First Publish Date - 2023-06-08T12:19:23+05:30 IST
బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి పండు గుజ్జును తీసుకుని అందులోకి అంతే సమానమైన
● బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి పండు గుజ్జును తీసుకుని అందులోకి అంతే సమానమైన రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె వేసి మిక్స్ చేయాలి. ఈ గుజ్జును జుట్టుకు పట్టించి గంటపాటు వదిలేయాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే జుట్టు సున్నితంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.
● రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి పండు రసానికి.. రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లు తాకే వరకు పట్టిస్తే జుట్టులో పీహెచ్ విలువ బ్యాలెన్స్ అవుతుంది. ఆరోగ్యంతో పాటు జుట్టులో మెరుపు వస్తుంది.
● బొప్పాయి పండు గుజ్జును రెండు టేబుల్ స్పూన్లను తీసుకుని.. ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె కలిపి బాగా మర్దనం చేసినట్లు జుట్టుకు పట్టిస్తే డాండ్రఫ్ తగ్గిపోతుంది. ముఖ్యంగా జుట్టు రాలడం ఆగిపోతుంది.
● బౌల్‌లో మూడు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జుకు, మూడు టేబుల్ స్పూన్ల అలొవెరాజెల్‌ను కలిపి మిశ్రమం చేయాలి. దీన్ని పట్టించిన తర్వాత ఆరిన తర్వాత మాత్రమే జుట్టును మంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తుంటే జుట్టులో తాజాదనం ఉంటుంది. అంతేనా.. తలమీద మంటలు, నొప్పులు పోతాయి. ఇన్ఫెక్షన్లు ఉన్నా తొలగిపోతాయి. ఒక్కమాటలో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
● అరకప్పు బొప్పాయి ముక్కలను గుజ్జుగా చేయాలి. ఇందులో అరకప్పు కొబ్బరిపాలు, టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తరచు జుట్టుకు పట్టిస్తుంటే జుట్టు స్మూత్‌గా షైనీగా తయారవుతుంది.
● రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి పండు గుజ్జులోకి మరో రెండు టేబుల్ స్పూన్ల అరటిపండు గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని పట్టిస్తే జుట్టులో డ్యామేజ్ ఉంటే అరికడుతుంది. జుట్టు పెరుగుదల ఉంటుంది.