Heart Attacks: గుండెకు గండం.. డిసెంబర్ లోనే ఈ సమస్య ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే..!
ABN , Publish Date - Dec 24 , 2023 | 04:14 PM
గుండెపోటు వల్ల సంభవిస్తున్న మరణాలలో డిసెంబర్ నెలలోనే ఎక్కువ నమోదు అవుతున్నాయి. అసలు కారణాలు ఇవీ..
చలికాలంలో ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ సమస్యలు విజృంభిస్తాయి. అధికశాతం మంది కూడా వీటిని తగ్గించుకోవడానికి రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఆహారం, పానీయాలలో మార్పులు చేసుకుంటారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో చలికాలంలో గుండెకు పెద్ద గండమే ఉందని తేలింది. గుండెపోటు వల్ల సంభవిస్తున్న మరణాలలో కూడా చలికాలంలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అసలు చలికాలంలో గుండెపోటు సమస్యలు పెరగడం వెనుక కారణాలు ఏంటి? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి తెలుసుకుంటే..
చలికాలంలో గుండెపోటు సమస్యలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అందునా డిసెంబర్ లోనే ఈ గుండెపోటు(Heart Attacks in December month) సమస్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. అక్యూట్ కరోనరీ సిండ్రోమ్(ACS) అనే సమస్య ప్రధానంగా మరణాలకు కారణమవుతోంది. ఇది చాలా తొందరగా మయోకార్డియల్ ఇస్కీమియా కు దారితీస్తుంది. చలికాలంలో వెచ్చదనం కోసం చాలామంది మగవాళ్లు పదే పదే ధూమపానం చేస్తుంటారు. దీంతో పాటు రక్తపోటు, హైపర్లిపిడెమియా సమస్యలు కూడా అక్యూట్ కరోనరీ డిసీజ్ కు ప్రధాన కారణం అవుతుంది. రక్తపోటు కారణంగా చలికాలంలో సంభవిస్తున్న మరణాలు ఎక్కువగా 71.8శాతం ఉన్నాయి.
ఇది కూడా చదవండి: పిల్లలు ఎత్తు పెరగట్లేదా? వెంటనే ఈ పనులు మొదలెట్టండి!
చలికాలంలో వృద్దులలో గుండెపోటు సమస్యలు సాధారణం. కానీ ఈ మధ్యకాలంలో గుండెపోటు సమస్యలు వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారిలో కూడా మరణాలకు కారణమవుతున్నాయి. ఈ డిసెంబర్ నెలలో కూడా అన్ని వయసుల వారికి జెండర్ తో సంబంధం లేకుండా గుండెపోటు సమస్య వస్తోంది.
చలికాలంలో గుండెపోటు సమస్యలు నిర్మూలించడానికి జీవనశైలి మార్చుకోవడం, శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంచడానికి శారీరకంగా చురుగ్గా ఉండటం, వ్యాయామాలు, యోగా పాటించడం. శరీరాన్ని చురుగ్గా ఉండే ఆహారాలు, విటమిన్-డి సమృద్దిగా తీసుకోవడం చేయాలి. వీలైనంత సమయం ఎండలో గడపడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నిశ్చలమైన జీవనశైలి ఉన్నవారిలో గుండెపోటు ప్రమాదాలు చాలా ఎక్కువ.
ఇది కూడా చదవండి: ఈ 6 కూరగాయలు తింటే చాలు.. 15రోజుల్లో పొట్ట కొవ్వు మాయం!
(గమనిక: ఇది ఆరోగ్య నిపుణులు, వైద్యులు పలుచోట్ల అందించిన సమాచారం ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏదైనా సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.