Health: దోసకాయ రసంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో!

ABN , First Publish Date - 2023-06-22T12:23:38+05:30 IST

చాలా మంది ఉదయాన్నే లేచి నిమ్మరసం, తేనెలను వేడినీళ్లలో కలుపుకు తాగుతారు. దీని ద్వారా జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుందని నమ్ముతారు. నిమ్మరసం, పుదీనా, దోసకాయ రసం కూడా బరువు తగ్గటానికి

Health: దోసకాయ రసంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో!

చాలా మంది ఉదయాన్నే లేచి నిమ్మరసం, తేనెలను వేడినీళ్లలో కలుపుకు తాగుతారు. దీని ద్వారా జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుందని నమ్ముతారు. నిమ్మరసం, పుదీనా, దోసకాయ రసం కూడా బరువు తగ్గటానికి ఎంతో ఉపకరిస్తుందని.. వాస్తవానికి తేనె, నిమ్మరసం కన్నా బాగా పనిచేస్తుందని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. దీని ద్వారా కలిగే లాభాలేమిటో చూద్దాం..

ఉడుకు తగ్గుతుంది..

మన శరీరానికి నీళ్లు తప్పనిసరి. తగినన్ని నీళ్లు లేకపోతే అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలన్నింటినీ దోసకాయ, నిమ్మకాయ, పుదీనా రసం తీరుస్తుంది. ఉదయాన్నే ఒక గ్లాసు ఈ రసాన్ని తాగితే రోజంతా ఎటువంటి వేడి సమస్యలు ఏర్పడవు.

శుద్ధి చేస్తుంది..

దోసకాయ, నిమ్మ, పుదీనాలలో అనేక రకాల ఔషధ గుణాలున్నాయి. ఇవి మన శరీరంలో ఉన్న మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. దీని ద్వారా మన శరీరంలో అంతర్గత అవయవాలు శుద్ధి అవుతాయి. అంతే కాకుండా జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది.

రోగనిరోధక శక్తికి ఊతం..

ఈ రసంలో ఉండే మినరల్స్‌, విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల రోగనిరోధక శక్తి పరిపుష్టమవుతుంది. దీని ద్వారా ఆరోగ్యం బాగుపడుతుంది.

చర్మ సంరక్షణ

ఈ రసం మన చర్మంపై కూడా పనిచేస్తుంది. ఇది మన చర్మంపై ఉన్న మలినాలను తొలగించి నిగారింపు వచ్చేలా చేస్తుంది.

Updated Date - 2023-06-22T12:26:59+05:30 IST