Digestive problems: జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి!

ABN , First Publish Date - 2023-05-31T13:43:54+05:30 IST

వేసవి వచ్చిదంటే చాలా మందికి జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. సరైన ఆహారం తీసుకోకపోవటం.. ఎక్కువగా నీళ్లు తాగకపోవటం.. వేడిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల

Digestive problems: జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి!
Digestive problems

వేసవి వచ్చిదంటే చాలా మందికి జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. సరైన ఆహారం తీసుకోకపోవటం.. ఎక్కువగా నీళ్లు తాగకపోవటం.. వేడిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. వీటి పరిష్కారానికి పౌష్టికాహార నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేమిటో చూద్దాం..

ఓట్స్‌: ఓట్స్‌ వల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. ఓట్స్‌లో కేలరీలు తక్కువ ఉండటంతో పాటుగా మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా పెరగటానికి ఉపకరిస్తుంది.

బార్లీ..రాగులు: ప్రతి రోజూ బార్లీ నీళ్లు తాగటం.. రాగి సంకటిని తినటం వల్ల వేసవిలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయంటున్నారు నిపుణులు. బార్లీ.. రాగి- మన కడుపులో ఏర్పడే అల్సర్స్‌ను తగ్గించటంతో పాటుగా.. గ్యాస్‌ను కూడా నివారిస్తాయి.

పెసర మొలకలు: ఉదయాన్నే పెసర మొలకలు తినటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. పెసర మొలకల్లో ఫైబర్‌, ఎంజైమ్స్‌, విటమిన్స్‌, మినరల్స్‌ ఉంటాయి. పెసర మొలకలను తినటం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అంతే కాకుండా దీనిలో కొవ్వు కూడా చాలా తక్కువ.

పెరుగన్నం: వేసవిలో పెరుగన్నం తప్పనిసరిగా తినాలి. పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్‌ మన పేవుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా చనిపోకుండా కాపాడుతుంది. అంతే కాకుండా పెరుగున్నం తినటం వల్ల ఎక్కువ సమయం ఆకలి కూడా వేయదు. ఓట్స్‌ వల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. ఓట్స్‌లో కేలరీలు తక్కువ ఉండటంతో పాటుగా మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా పెరగటానికి ఉపకరిస్తుంది.

బార్లీ..రాగులు: ప్రతి రోజూ బార్లీ నీళ్లు తాగటం.. రాగి సంకటిని తినటం వల్ల వేసవిలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయంటున్నారు నిపుణులు. బార్లీ.. రాగి- మన కడుపులో ఏర్పడే అల్సర్స్‌ను తగ్గించటంతో పాటుగా.. గ్యాస్‌ను కూడా నివారిస్తాయి.

పెసర మొలకలు: ఉదయాన్నే పెసర మొలకలు తినటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. పెసర మొలకల్లో ఫైబర్‌, ఎంజైమ్స్‌, విటమిన్స్‌, మినరల్స్‌ ఉంటాయి. పెసర మొలకలను తినటం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అంతే కాకుండా దీనిలో కొవ్వు కూడా చాలా తక్కువ.

పెరుగన్నం: వేసవిలో పెరుగన్నం తప్పనిసరిగా తినాలి. పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్‌ మన పేవుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా చనిపోకుండా కాపాడుతుంది. అంతే కాకుండా పెరుగున్నం తినటం వల్ల ఎక్కువ సమయం ఆకలి కూడా వేయదు.

Updated Date - 2023-05-31T13:43:54+05:30 IST