Beauty: తినటానికి కాదు.. ఆరెంజ్‌ను ఇలా ఉపయోగిస్తే..!

ABN , First Publish Date - 2023-06-05T12:59:57+05:30 IST

తినటానికి ఎక్కువ ఇష్టపడే ఆరెంజ్‌తో అందాన్నీ మెరుగుపర్చుకోవచ్చు. ఇది సిట్రస్‌ జాతికి చెందినది. ఇంతకీ ఆరెంజ్‌తో

Beauty: తినటానికి కాదు.. ఆరెంజ్‌ను ఇలా ఉపయోగిస్తే..!
Beauty

తినటానికి ఎక్కువ ఇష్టపడే ఆరెంజ్‌తో అందాన్నీ మెరుగుపర్చుకోవచ్చు. ఇది సిట్రస్‌ జాతికి చెందినది. ఇంతకీ ఆరెంజ్‌తో చర్మ సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు? ఆరెంజ్‌ ఫేస్‌ప్యాక్స్‌ ఏంటో తెల్సుకుందాం..

● ఒక ఆరెంజ్‌ పండు, బొప్పాయిలో పావుభాగం తీసుకుని మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖంమీదతో పాటు మెడచుట్టూ పట్టించాలి. ఇలా చేశాక 20 నిముషాల తర్వాత చన్నీళ్లతో ముఖాన్ని కడగాలి. ఇలా చేస్తుంటే ముఖం మీద మంటలు మాయమవుతాయి.

● ఒకటి ఆరెంజ్‌, ఒక అరటిపండును కలిపి చూర్ణం చేయాలి. ఈ చూర్ణాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత మంచి నీటితో శుభ్రపరచాలి. ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

● బౌల్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నారింజ రసం, టేబుల్‌ స్పూన్‌ శనగపిండి, టేబుల్‌ స్పూన్‌ రోజ్‌ వాటర్‌ కలిపి మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని పట్టిస్తే పిగ్మింటేషన్‌ తగ్గిపోతుంది.

● టేబుల్‌ స్పూన్‌ ఆరెంజ్‌ పల్ప్‌, అర టేబుల్‌ స్పూన్‌ టీ ఆకులను కలిపి చూర్ణం చేయాలి. దీన్ని పట్టిస్తే ఆయిలీ ఫేస్‌ ఉన్న వాళ్లకు ఉపశమనం ఉంటుంది.

● బౌల్‌లో టేబుల్‌ స్పూన్‌ ఆరెంజ్‌ పల్ప్‌తో పాటు టీస్పూన్‌ కొబ్బరినూనె తీసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాక అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే.. మీ చర్మం మృదువుగా తయారవుతుంది. ముఖంమీద ఉండే మట్టి తొలగిపోతుంది.

● ఆరెంజ్‌ తొక్క పౌడర్‌ టేబుల్‌ స్పూన్‌ను బౌల్‌లో తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, టేబుల్‌ స్పూన్‌ రోజ్‌ వాటర్‌ కలపాలి. ఈ చూర్ణం ముఖం మీద పట్టిస్తే మొటిమలు తొలగిపోతాయి.

● బౌల్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల అలొవెరా జెల్‌, రెండు టేబుల్‌ స్పూన్ల ఆరెంజ్‌ పౌడర్‌, అర టీస్పూన్‌ నిమ్మరసం కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తుంటే వాపులు, ఎర్రగా కందడం.. లాంటి ఇతర చర్మసమస్యలుంటే తొలగిపోతాయి.

Updated Date - 2023-06-05T12:59:57+05:30 IST