fruits: బ్రేక్‌ఫాస్ట్ మానేసి పండ్లు తీసుకుంటే..
ABN , First Publish Date - 2023-06-12T13:53:22+05:30 IST
చాలామంది ఉదయం పూట అల్పాహారం చేయకుండా మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ చేయాలని అంటారు. మరికొందరేమో బరువు
చాలామంది ఉదయం పూట అల్పాహారం చేయకుండా మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ చేయాలని అంటారు. మరికొందరేమో బరువు తగ్గడానికి అల్పాహారం మానేయాలని చెబుతూ ఉంటారు. ఉదయం అల్పాహారానికి బదులు పండ్లు ఆరోగ్యకరమైనవే కదా అని తినేస్తుంటారు. బ్రేక్ ఫాస్ట్‌కు బదులు పండ్లు తినడం వలల లాభాలు, నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పండ్లలో నీటిశాతం ఎక్కువగా ఉంటంది, పండ్లు తినడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. పండ్లలో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడానికి పండ్లు మంచివని చెప్పవచ్చు. అల్పాహారం తినక పోవడం వల్ల కార్పోహైడ్రేట్లు శరీరానికి అందవు. శరీరానికి శక్తిని ఇవ్వడంలో ఇవి చాలా కీలకం. అల్పాహారం తినకపోవడం వల్ల రోజంతా ఆకలి వేస్తుంది. దీనివల్ల పగటిపూట ఎక్కువ తినడం, బరువు పెరిగే అవకావం ఉంది. అల్పాహారం మానేయడం వల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది. పండ్లు మాత్రమే ఆహారం తీసుకుంటే పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటీకి అవి సమతుల్య ఆహారంలా అన్ని పోషకాలు అందించలేవు. సరైన అల్పాహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఫైబర్, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ అన్నీ ఉంటాయి. రాత్రి సుమారు 7-9 గంటల ఉపవావాసాన్ని బ్రేక్ చేస్తుంది. నిద్రలేచిన తర్వాత చేసే మొదటి భోజనం వల్ల రోజంతా యాక్ట్టీవ్‌గా ఉండొచ్చు. ఉదయం పూట అల్పాహారం మానేసి పండ్లు మాత్రమే తింటే, రక్తంలో చక్కెర స్థాయిలు స్వల్పంగా తగ్గుతాయి. ఎందుకంటే ఉదయం పూట అల్పాహారం తినడం మానేసి కేవలం పండ్లు మాత్రమే తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి.
హైదరాబాద్, గచ్చిబౌలి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి)