Pomegranate: రక్తహీనత నుంచి బయటపడాలంటే..!
ABN , First Publish Date - 2023-08-12T12:43:51+05:30 IST
దానిమ్మ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉంటాయి. ఐరెన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మ పండులో మెండుగా ఉంటాయి.
దానిమ్మ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉంటాయి. ఐరెన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మ పండులో మెండుగా ఉంటాయి. సంవత్సరం పొడవునా ఈ పండ్లు మనకు లభిస్తాయి. రక్తహీనతతో బాధపడేవాళ్లు ప్రతిరోజూ దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగతాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచే దానిమ్మ పండ్లు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం...
ఒక దానిమ్మ పండులో సుమారు 600 వరకు గింజలు ఉంటాయట. దానిమ్మ పండులో 7 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్, 30 శాతం విటమిన్ సి, 16 శాతం ఫోలేట్, 12 శాతం పొటాషియం ఉంటాయి. ఒక కప్పు దానిమ్మ పండులో 24 గ్రాముల చక్కెర, 144 కేలరీల శక్తి కూడా ఉంటుంది. రెండు వారాల పాటు రోజూ 150మి.లీ దానిమ్మ రసాన్ని తాగడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని ఒక అధ్యాయనంలో తేలింది. రక్తహీనతతో బాధపడేవాళ్లకు దానిమ్మను మించిన ఔషధం లేదు. యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే దానిమ్మ తింటే రక్తకణాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. అంతే కాకుండా దానిమ్మ పండ్లతో జ్ఞాపశక్తి కూడా మెరుగవుతుందని తేలింది. క్రమం తప్పకుండా దానిమ్మను తీసుకుంటే అల్జీమర్స్ వ్యాధిని నివారించొచ్చని వైద్యులు చెబుతున్నారు.
దానిమ్మతో సమస్యలు దూరం...
చలికాలంలో దానిమ్మ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బలపడుతుంది.
దానిమ్మలో యంటీఏజింగ్ గుణాలు మెండుగా ఉంటాయి. దానిమ్మ రక్తంలో ఐరన్‌ను శాతం పెంచుతుంది. ఇది హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచుతుంది.
ఇందులోని ప్లేవనాయిడ్స్ కేన్సర్ రాడికల్స్‌ను నివారిస్తుంది. నిత్యం దానిమ్మతింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నోపోషక విలువలుంటాయి.
వృద్ధాప్యానికి దారితీసే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడి, యవ్వనంగా ఉంచేలా చేస్తుంది.
దానిమ్మ గింజల్లో విటమిన్ బి, సి, కె, పొటాషియం, కాల్షియం వంటి పలు రకాల మినరల్స్ మెండుగా ఉంటా యి.
మలబద్దకం, ఒబెసిటీ వంటి సమస్యలను దానిమ్మ దూరం చేస్తుంది.
అందం మెరుగుపతుంది...
దానిమ్మ తినడం వల్ల చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. రోజూ కప్పు దానిమ్మ గింజలు తినడం వల్ల స్కిన్‌టోన్ మెరుగవుతుంది.
విటమిన్స్, పీచు అధికంగా ఉంటుంది. ఇవి చర్యంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి. దానిమ్మ పండులో ఉన్న ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ చర్మం తేమ కోల్పోకుండా నివారిస్తుంది.
చర్మంపై ఉండే జిడ్డు, మొటిమలను శక్తివంతంగా తగ్గించడంలో దానిమ్మ సూపర్ ఫ్రూట్. వివిధ చర్మ సమస్యలను దూరం చేయడంలో దానిమ్మ ఎంతో సహాయపడుతుంది.
చాలామందికి రాత్రిపూట దానిమ్మతింటే జలుబు చేస్తుందని, కఫం ఏర్పడుతుందని అనుకుంటారు. కానీ అది అపోహమాత్రమే. రాత్రి పడుకునే ముందు దానిమ్మ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. ఒక గ్లాస్ దాని మ్మ జ్యూస్‌లో ఒక టీస్పూన్‌లో అల్లం వేసుకుని తాగితే కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. నిద్రించే ముందు దానిమ్మను పెరుగుతో తీసుకుంటే నిద్రపడుతుంది. రాత్రి పూట దానిమ్మను తింటే ఉదయం వరకు ఆకాలి వేయకుండా ఉం టుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.
హైదరాబాద్, మాదాపూర్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి)