Radish: మంచి చేసే ముల్లంగి! ఈ విధంగా తింటే మాత్రం..!

ABN , First Publish Date - 2023-08-16T10:54:58+05:30 IST

ముల్లంగి ఇప్పుడిప్పుడే మార్కెట్లో కనిపిస్తోంది. ముల్లంగితో పరోటాలు, పచ్చడి- ఇలా రకరకాల వంటలు చేస్తూ ఉంటారు. అయితే ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ మందికి తెలియవు. ముల్లంగి మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటమే కాకుండా దగ్గు, జలుబులను దూరం చేస్తుంది. ముల్లంగి వల్ల కలిగే ఇలాంటి ఇతర ప్రయోజనాలేమిటో చూద్దాం...

Radish: మంచి చేసే ముల్లంగి! ఈ విధంగా తింటే మాత్రం..!

ముల్లంగి ఇప్పుడిప్పుడే మార్కెట్లో కనిపిస్తోంది. ముల్లంగితో పరోటాలు, పచ్చడి- ఇలా రకరకాల వంటలు చేస్తూ ఉంటారు. అయితే ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువ మందికి తెలియవు. ముల్లంగి మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటమే కాకుండా దగ్గు, జలుబులను దూరం చేస్తుంది. ముల్లంగి వల్ల కలిగే ఇలాంటి ఇతర ప్రయోజనాలేమిటో చూద్దాం...

  • ముల్లంగిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అజీర్ణం ఉన్నవారికి ఇది ఎంతో ఉపకరిస్తుంది.

  • బరువు తగ్గాలనుకొనే వారు ముల్లంగిని క్రమం తప్పకుండా తినటం ఎంతో మంచిది. దీనిలో నీరు ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. దీని వల్ల ముల్లంగిని తిన్నప్పుడు -ఎక్కువ సమయం కడుపు నిండినట్లు ఉంటుంది.

  • ముల్లంగిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనిని రోజూ తింటే రక్తనాళాలలో చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల బీపీ తగ్గుతుంది.

  • ముల్లంగిలో జింక్‌, ఫాస్పరస్‌, విటమిన్‌ ఏ,సీ,కెలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల చర్మవ్యాధులు రావు. అంతే కాకుండా ముల్లంగిని తినటం వల్ల రక్తకణాల సంఖ్య పెరుగుతుంది.

  • కాలేయ సమస్యల పరిష్కారానికి.. ముఖ్యంగా పచ్చకామేర్లకు ముల్లంగి మంచి మందు. దీనిలో ఉండే ఇండోల్‌-3, మిథైల్‌ -3, బుటినల్‌ఐసోథిసైనేట్‌ వంటివి కాలేయంలో ఉండే మలినాలను తొలగిస్తాయి.

  • చాలా మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ముల్లంగిని తినటం వల్ల ప్రమాదం ఉందనుకుంటారు. ముల్లంగిలో ఎక్కువ ఫైబర్‌, నీళ్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్‌ తక్కువ. అందువల్ల ఎటువంటి సమస్యలూ ఎదురుకావు.

  • ముల్లంగి తిన్న వెంటనే పాలు తాగకూడదు. ఇదే విధంగా ముల్లంగి, దోసకాయలను కలిపి తినకూడదు. ముల్లంగిలో ఉండే విటమిన్‌ ‘సి’ వల్ల కడుపు మంట.. నొప్పి మొదలైనవి వచ్చే అవకాశముంది.

Updated Date - 2023-08-16T10:54:58+05:30 IST