ఎండుద్రాక్షతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో...!
ABN , First Publish Date - 2023-05-22T14:01:20+05:30 IST
డ్రైఫ్రూట్స్ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి కిస్‌మిస్(ఎండు ద్రాక్ష) బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, అంజీర తింటే అనారోగ్యాలకు దూరంగా
డ్రైఫ్రూట్స్ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి కిస్‌మిస్(ఎండు ద్రాక్ష) బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, అంజీర తింటే అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. కిస్‌మి్‌సతో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఆయుర్వేదంలో అనేక రోగాలకు ఎండుద్రాక్ష ఉపయోగిస్తారు. చూడటానికి చిన్నగా ఉన్నా అందులో ఖనిజ లవణాలు, విటమిన్‌లు శరీరానికి కావాల్సిన శక్తినిస్తాయి. కిస్‌మిస్ తింటే అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు. రుచికి తియ్యగా, పుల్లగా ఉన్నా అందరూ ఇష్టంగా తింటారు. వీటిలో పాలిఫినాలిక్ పైటో పోషకాలు ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. బాక్టీరియా వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్‌లను అడ్డుకుంటాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా చేస్తాయి. పిల్లలకు రోజూ ఉదయాన్నే వీటిని తినిపించడం అలవాటు చేస్తే మెదడు చురుకుగా పనిచేస్తుంది. కిస్‌మి్‌సలో ఉండే కాల్షియం దంతాలకు, ఎముకలకు మంచిది. రక్తహీనతతో బాధపడే స్త్రీలకు ఎండుద్రాక్ష చక్కని పరిష్కారం చూపుతుంది.
ఉపయోగాలు
కిస్‌మిస్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వలన రక్తహీనత సమస్య పరిష్కారం అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
దంత సమస్యలు, చిగుళ్ళవ్యాధులు తగ్గుతాయి. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.
ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త దోషాలు ఉన్న వారికి కిస్‌మిస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మూత్రపిండాలు, పేగు, మూత్రాశయం పనితీరు మెరుగుపడుతుంది.
ఊపిరి తిత్తుల పనితీరు సరిగా లేనివాళ్ళకు ఎండుద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది
ఎండుద్రాక్ష తినడం వలన సంతాన సాఫల్యత మెరుగుపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
ఇవి మెదడుకు మేలు చేస్తాయి. జ్ఙాపకశక్తి, ఏకాగ్రత బాగా పెరుగుతుంది.
కిస్‌మి్‌సలో పొటాషియం, కెటిచిన్‌లు, విటమిన్-సి, పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్ధరైటి్‌సతో బాధపడే వారికి మేలు చేస్తాయి. వీటిలోని ఫినాలిక్ పదార్థాలు వివిధ రకాల క్యాన్స్‌ర్‌లు రాకుండా అడ్డుకుంటాయి.
తరచూ కిస్‌మి్‌సలు తింటే రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయి. ఆకలి వేసినపుడు స్నాక్స్ కంటే వీటిని తినడం ఎంతో మంచిది.
ఎండుద్రాక్షలో పీచు పదార్థాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్దకం, డయేరియాని నివారిస్తుంది. శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడుతుంది.
అన్ని వయసులవారు తినొచ్చు
ఎండు ద్రాక్షల్లో పోషక విలువలు మెండుగా ఉంటాయి. వీటిని వయస్సుతో సంబంధం లేకుండా అందరూ తినవచ్చు. కిస్‌మి్‌సలో రాగి, బి, సి విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఎర్రరక్త కణాల ఉత్పత్తికి దోహదం చేయడమే కాక రక్త సరఫరా మెరుగుపడేందుకు సహాయ పడతాయి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. చలికాలంలో కిస్‌మిస్ తినడం వల్ల మలబద్దకం, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌లను అదుపు చేస్తుంది. -
-డాక్టర్ మహేందర్, చిల్డ్రన్స్ స్పెషలిస్ట్
హైదరాబాద్, షాపూర్‌నగర్, మే 21 (ఆంధ్రజ్యోతి)