మోకాలి నొప్పులతో బాధపడుతున్నారా? అయితే నువ్వులు ఇలా తీసుకుంటే..!

ABN , First Publish Date - 2023-06-12T12:48:16+05:30 IST

నువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందునే పండగలకు చేసుకునే పిండి వంటల్లో వాటికి ప్రత్యేక స్థానం ఇచ్చా రు. ముఖ్యంగా

మోకాలి నొప్పులతో బాధపడుతున్నారా? అయితే నువ్వులు ఇలా తీసుకుంటే..!
Nuvvulu

నువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందునే పండగలకు చేసుకునే పిండి వంటల్లో వాటికి ప్రత్యేక స్థానం ఇచ్చా రు. ముఖ్యంగా పెద్దలు చలికాలంలో వీటి అవసరం ఎక్కువగా ఉన్నందునే పలు ప్రాంతాల్లో విభిన్నమైన పండి వంటలు చేస్తారు.

నువ్వుల ఉపయోగాలు..

నువ్వులవల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ఫైబర్‌ కంటెంట్‌, విటమిన్లు అనేక అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడతాయి.

మోకాలి నొప్పులకు నువ్వులతో మేలు

ఆస్టియో ఆర్థరైటిస్‌ సర్వసాధారణంగా వచ్చే జాయింట్‌ పెయిన్‌. ఇవి తరచుగా మోకాలు నొప్పులకు గురిచేస్తోంది. ఇన్‌ప్లమేషన్‌, ఆక్సిడేటివ్‌వల్ల మృధులాస్థి కీళ్లు దెబ్బతింటాయి. నువ్వుల్లో ఉండే సెసామిన్‌ అనే సమ్మేళనం యాంటీ ఇన్‌ప్లమేటరీ, యాంటీయాక్సిడంట్‌ ప్రభావాలు కలిగి కార్టిలేజ్‌ను రక్షిస్తాయి. రోజూ 40 గ్రాముల నువ్వులు తీసుకుంటే 2 నెలల్లో కీళ్ల నొప్పులు 65 శాతం తగ్గినట్టు ఒక అధ్యయనం వెల్లడించింది.

థైరాయిడ్‌ ఆరోగ్యానికి నువ్వులు..

నువ్వుల్లో ఉండే సెలీనియం థైరాయిడ్‌ పేషెంట్లకు మేలు చేస్తోంది. సెలీనియం థైరాయిడ్‌ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో పనిచేస్తోంది. ఐరన్‌, కాపర్‌, జింక్‌, విటమిన్‌ బీ6 వంటివి థైరాయిడ్‌ ఆరోగ్యనికి కాపాడుతాయి.

హైదరాబాద్, నార్సింగ్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2023-06-12T12:49:24+05:30 IST