Papaya Seeds: ఈ గింజల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
ABN , First Publish Date - 2023-02-15T16:47:17+05:30 IST
బొప్పాయి పండు (Papaya seeds) ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం అందరికీ తెలుసు. బొప్పాయి గింజల వల్ల కలిగే ప్రయోజనాలు కొద్ది మందికి మాత్రమే తెలుసు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
బొప్పాయి పండు (Papaya seeds) ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం అందరికీ తెలుసు. బొప్పాయి గింజల వల్ల కలిగే ప్రయోజనాలు కొద్ది మందికి మాత్రమే తెలుసు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
బొప్పాయి గింజల్లో జింక్ (Zinc), ఫాస్పరస్, కాల్షియం (Calcium), మెగ్నిషియం (Magnesium)వంటి లవణాలతో పాటుగా మోనోశాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందువల్ల బొప్పాయి గింజలను ఎండపెట్టుకొని పొడి చేసుకొని ఆహారంలో కలుపుకొని తినటం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి.
బొప్పాయి గింజల్లో కార్పైన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇది మన పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా(Bacteria)ను చంపుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ గింజల్లో ఫైబర్ శాతం కూడా ఎక్కువే ఉంటుంది.
బొప్పాయి గింజలలో ఉండే ఫైబర్ యాసిడ్స్ శరీరంలో చెడు కొలస్ట్రాల్ (Cholesterol) శాతాన్ని తగ్గిస్తాయి.
ఈ గింజల్లో విటమిన్ సి ఉంటుంది. దీని వల్ల కీళ్లనొప్పులు, గౌట్ వంటి వ్యాధులు రావు.
బొప్పాయి గింజల్లో కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఈస్ట్రోజిన్‌లాంటి కొన్ని హార్మోన్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. బొప్పాయి గింజల పొడిని క్రమం తప్పకుండా తీసుకొనే మహిళలకు రుతుస్రావం సమయంలో వచ్చే నెప్పి తక్కువగా ఉంటుంది.
బొప్పాయి గింజల పొడి డెంగ్యూ (Dengue) వంటి అనేక రకాల జ్వరాల (fever)కు విరుగుడుగా పనిచేస్తుంది.
ఇది కూడా చదవండి: తప్పు వరుడిదే.. సారీ చెబుతామన్నా వినని వధువు.. నాకీ పెళ్లి వద్దంటూ తేల్చేసింది.. అసలేం జరిగిందంటే..