Dry fruits: కరోనా తర్వాత గిరాకీ పెరిగింది వీటికే.. ఎందుకంటే..!
ABN , First Publish Date - 2023-05-30T14:18:05+05:30 IST
డ్రైఫ్రూట్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరోనా తరువాత, కరోనా సమయంలో వీటి వాడకం బాగా పెరిగింది. రంజాన్ మాసంలో డ్రైఫ్రూట్స్ ఎక్కువగా విక్రయిస్తామని
డ్రైఫ్రూట్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరోనా తరువాత, కరోనా సమయంలో వీటి వాడకం బాగా పెరిగింది. రంజాన్ మాసంలో డ్రైఫ్రూట్స్ ఎక్కువగా విక్రయిస్తామని దుకాణదారులు అంటున్నారు. ఇమ్యూనిటీ పెంపులో ఇవి బాగా ఉపయోగపడతాయి. డ్రైఫ్రూట్స్ కొన్నింటిని నానబెట్టి తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం, వంటివి నానబెట్టకుండా తినడం మంచిదని, బాదం, కిస్‌మిస్, వాల్‌నట్ వంటివి నీటిలో నానబెట్టి తింటే మంచిదని చెబుతున్నారు. ఇవి శరీరాభివృద్ధికి దోహదపడతాయంటున్నారు. వీటిలో పోషక విలువలు అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సహాయపడతాయి. డ్రైఫ్రూట్స్‌ను అన్ని వయస్సుల వారు క్రమం తప్పకుండా తింటే ఆరోగ్యం పెంపొందుతుంది. వీటిలో ప్రోటీన్స్, ప్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఉంటాయి. పోషకాలు పుష్కలం. డ్రైఫ్రూట్స్‌ను 20 గ్రాములకంటే ఎక్కువగా తినకూడదు. నేరుగా తినడం కూడా మంచిది కాదు. ఇటీవల కాలంలో ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరుగుతోంది. ఖర్చు ఎక్కువైనా డ్రైఫ్రూట్స్ కొనుగోలు చేస్తున్నారు. జీడిపప్పు, బాదంలో ఉండే కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. పిస్తాలో బి-6 విటమిన్ గుండె జబ్బులను నివారిస్తుంది. ఇందులో ఉంటే కొవ్వులు మన శరీరానికి ఎంతోమేలు చేస్తాయి. నాడీవ్యవస్థను బాగు చేసుకునేందుకు డ్రైఫ్రూట్స్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
ధరలు
జీడిపప్పు ధర కిలో రూ.900- 1200 ఉంటుంది. ఇది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది. విదేశాల నుంచి వచ్చే బాదం ధరం రూ.900-1000 మధ్య ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే కిస్‌మిస్ ధర రూ.800-900 ఉంటుంది. పిస్తా ధర రూ.1000-1200 వందల వరకు ఉంటుంది. కిలో అంజీర్ రూ.800-1000 పలుకుతుందని వర్తక సంఘం సభ్యులు తెలిపారు.
ఉపయోగాలు
బాదం, పిస్తా, జీడిపప్పు, నేరేడు పండు, ఖర్జూరం, ఎండు కొబ్బరి, వాల్‌నట్స్, ఎండు ద్రాక్ష, ఫ్రునె, డ్రైబెరిన్, పెకన్లు, డ్రై పిగ్స్ డ్రైఫ్రూట్స్‌గా వాడకంలో ఉన్నాయి.
డ్రైఫ్రూట్స్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు నివారించడంలో ఉపయోగపడతాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. టైప్-2 డయాబెటిక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
డ్రై పిగ్స్ ప్రత్యేకమైన పండు. పునరుత్పత్తి, శ్వాసకోశ సమస్యలతో పోరాడుతున్నట్లైతే వీటిని తింటే మంచిది. ఎముకల సాంద్రత మెరుగుపరుస్తుంది.
ఫ్రూనే ఇది చాలా పోషకమైనది. ఎముకలు, కండరాలు నిర్మాణంలో సహాయపడుతుంది. కొలస్ట్రాల్ స్థాయిని నివారిస్తుంది.
ఎండుద్రాక్ష (కి్‌సమిస్).. ఇది సహజంగా తీపి డ్రైఫ్రూట్. ఇందులో చక్కెరలు, కొవ్వు, ప్రోటీన్, డైటరీ, ఫైబర్, విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. రుచికరమైన ఆహార పదార్థాలలో సలాడ్ టాపింగ్‌గా ఉపయోగిస్తారు.
రక్తపోటును నివారించడంలో, జీర్ణాశయం సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది.
వాల్‌నట్స్.. మెదడు ఆకారంలో ఉండే ఈ గింజ ఆరోగ్యకరమైన కొవ్వులు, మాంసకృత్తులు, ఫైబర్‌ను కలిగి ఉండి క్యాన్సర్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. డయాబెటిస్ రాకుండా సహాయపడుతుంది.
వాజీల్ నట్స్.. గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికకు సహాయపడుతుంది.
ఖర్జూరం.. రుచికరమైన ఐరన్‌రిచ్ కలిగిన డ్రైఫ్రూట్. మెదడు ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది. శరీరంలో చక్కెర స్తాయిని కంట్రోల్ చేస్తుంది.
నేరేడు పండు.. ఇందులో వివిధ కరాల విటమిన్‌లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. గుండె, కళ్లను రక్షిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. శరీర ముడతలను తగ్గిస్తుంది.
జీడిపప్పు.. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. మన శరీరంలో ఉండే చక్కెరస్థాయిని నిర్వర్తిస్తుంది. గుండెకు ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడుతుంది.
పిస్తా తినడం వలన గుండెకు మంచిది. మధుమేహ నివారణకు, హిమోగ్లోబిన్ ఉత్పత్తికి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
బాదం పప్పు.. గుండె జబ్బు రాకుండా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహాయపడుతుంది. బరువు పెరగకుండా నివారిస్తుంది.
-హైదరాబాద్, షాపూర్‌నగర్, మే 29 (ఆంధ్రజ్యోతి)