Rain Tips: ఈ మెలకువులతో వానల్లో వయ్యారంగా...

ABN , First Publish Date - 2023-08-19T12:51:18+05:30 IST

వానల్లో కొన్ని టిప్స్‌ పాటించకపోతే మేకప్‌ కారిపోయి, అసలుకే మోసమొస్తుంది. కాబట్టి ఈ కాలంలో మెల్ట్‌ ప్రూఫ్‌ మేకప్‌ వేసుకోవాలి. అందుకోసం ఈ మెలకువలు అనుసరించాలి.

Rain Tips: ఈ మెలకువులతో వానల్లో వయ్యారంగా...

వానల్లో కొన్ని టిప్స్‌ పాటించకపోతే మేకప్‌ కారిపోయి, అసలుకే మోసమొస్తుంది. కాబట్టి ఈ కాలంలో మెల్ట్‌ ప్రూఫ్‌ మేకప్‌ వేసుకోవాలి. అందుకోసం ఈ మెలకువలు అనుసరించాలి.

క్రీమ్‌ ఆధారితమైనవైతే...

మేకప్‌లో ఉపయోగించే ఉత్పత్తులు క్రీమ్‌ బేస్‌డ్‌ అయితే, వాటిని వీలైనంత పరిమితంగా వాడుకోవాలి. వాటిని బాగా బ్లెండ్‌ చేయడంతో పాటు, చెదిరిపోకుండా ఉండడం కోసం పౌడర్‌తో సెట్‌ చేసుకోవాలి. ఇలా మేకప్‌ వేసుకోగలిగితే ‘ఎయిర్‌ బ్రష్‌’ లుక్‌ సొంతమవుతుంది.

సెట్టింగ్‌ పౌడర్‌తో...

మేకప్‌ ఎక్కువ సమయం పాటు చెక్కుచెదరకుండా ఉండడం కోసం సెట్టింగ్‌ పౌడర్‌ వాడుకోవాలి. మేకప్‌ పూర్తయిన తర్వాత పెద్ద బ్రష్‌ తీసుకుని ముఖం, మెడ మీద పరుచుకునేలా సెట్టింగ్‌ పౌడర్‌ను అద్దుకోవాలి.

బోల్డ్‌ లిప్‌స్టిక్‌

మీ దగ్గర లెక్కలేనన్ని లిప్‌స్టిక్‌లు ఉండి ఉండొచ్చు. కానీ వానా కాలంలో బోల్డ్‌ కలర్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. ఎరుపు, మెరూన్‌, బ్రౌన్‌ రంగులు వానాకాలంలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

మస్కారా ఇలా...

వాటర్‌ ప్రూఫ్‌ మస్కారా వానాకాలానికి అనువైనది. అదనపు భద్రత కోసం మస్కారా అప్లై చేసిన తర్వాత, లైట్‌గా పౌడర్‌ డస్టింగ్‌ చేసుకొని, రెండో కోట్‌ వేస్తే కనురెప్పలు చిక్కగా కనిపిస్తాయి.

సింపుల్‌గా...

వానాకాలం వీలైనంత తక్కువ మేకప్‌ వేసుకోవాలి. ఫౌండేషన్‌ తక్కువగా వాడుకోవాలి. ఈ కాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పలుచని మేకప్‌ ఎక్కువ సమయం పాటు చెదిరిపోకుండా ఉంటుంది. ఒకవేళ వానకు తడిచి, చెదిరిపోయినా, ముఖం కళావిహీనంగా మారిపోకుండా ఉంటుంది.

Updated Date - 2023-08-19T12:51:18+05:30 IST