A Black Chapter: ఇమ్రాన్ అరెస్టుతో అట్టుడుకుతున్న పాక్.. తీవ్రంగా స్పందించిన ఆర్మీ

ABN , First Publish Date - 2023-05-11T16:06:21+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khain) అరెస్ట్ తర్వాత ఆ దేశంలో అస్థిరత

A Black Chapter: ఇమ్రాన్ అరెస్టుతో అట్టుడుకుతున్న పాక్.. తీవ్రంగా స్పందించిన ఆర్మీ

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khain) అరెస్ట్ తర్వాత ఆ దేశంలో అస్థిరత నెలకొంది. హింస రాజ్యమేలుతోంది. ఇమ్రాన్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు వాహనాలకు నిప్పు పెడుతున్నారు. ఇమ్రాన్‌ను తక్షణం విడుదల చేయకుంటే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని హెచ్చరిస్తున్నారు. ఏకంగా ప్రధాని షేబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ఇంటిపైనే పెట్రోలు బాంబులు విసిరి నానా హంగామా చేశారు.

దేశంలో నెలకొన్న హింసాత్మక పరిణామాలపై పాకిస్థాన్ ఆర్మీ మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) విభాగం తీవ్రంగా స్పందించింది. మే 9న జరిగిన పరిణామాలను దేశ చరిత్రలోనే ‘బ్లాక్ చాప్టర్’ (Black Chapter)గా అభివర్ణించింది. ఆందోళనకారులు ముఖ్యంగా ఆర్మీ ఆస్తులు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు పేర్కొంది. అలాగే, ఆందోళనకారులు ఆర్మీ వ్యతిరేక నినాదాలు చేస్తున్నట్టు తెలిపింది.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) స్టేట్‌మెంట్, చట్టాన్ని ఉటంకిస్తూ పీటీఐ చైర్మన్ అయిన ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టును ఐఎస్‌పీఆర్ సమర్థించింది.

Updated Date - 2023-05-11T16:06:21+05:30 IST