Cow-dung powered tractor: కొత్త ట్రాక్టర్.. ఆవు పేడే ఇంధనం.. బ్రిటన్ కంపెనీ సృష్టి
ABN , First Publish Date - 2023-01-15T19:13:08+05:30 IST
పర్యావరణ పరిరక్షణ కోసం బ్రిటన్ కంపెనీ బెన్నమన్ తాజాగా సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: పర్యావరణ పరిరక్షణ కోసం బ్రిటన్ కంపెనీ బెన్నమన్ తాజాగా సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. ఆవు పేడతో నడిచే ఓ వినూత్న ట్రాక్టర్‌ను(Cow dung powered tractor) రూపొందించింది. 270 బీహెచ్‌పీ సామర్థ్యం గల ట్రాక్టర్.. పేడ నుంచి వెలువడే మిథేన్(Methane) వాయువును ఇంధనంగా వినియోగిస్తుంది. తద్వారా మిథేన్ వాయువు పర్యావరణంలోకి విడుదల కాకుండా నిరోధించవచ్చని బ్రిటన్ కంపెనీ చెబుతోంది. గ్రీన్‌హౌన్ వాయువులన్నింటిలోకి(Green House Gases) మిథేన్ వాయువు అత్యంత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు చెబుతారు. ఈ వాయువు కారణంగా భూతాపం అధికంగా పెరుగుతుందని చెపుతారు. కాగా.. తమ ట్రాక్టర్ ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం రంగం, పాడిపరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని కంపెనీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.