Imran Khan: పాక్‌లో ప్రజాస్వామ్యం ఘోరం: ఇమ్రాన్ ఖాన్

ABN , First Publish Date - 2023-05-14T15:59:28+05:30 IST

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం గతంలో ఎన్నడూ లేనంత అథమ స్థాయిలో ఉందని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి, తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. న్యాయవ్యవస్థే దేశానికి ఏకైక ఆశాకిరణంగా ఉందని వ్యాఖ్యానించారు.

Imran Khan: పాక్‌లో ప్రజాస్వామ్యం ఘోరం: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో (Pakistan) ప్రజాస్వామ్యం (Democracy) గతంలో ఎన్నడూ లేనంతగా అథమ స్థాయిలో (All Time low) ఉందని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి, తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ (Imran Khan) అన్నారు. న్యాయవ్యవస్థే దేశానికి ఏకైక ఆశాకిరణంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశంలోని కూటమి ప్రభుత్వానికి ఎన్నికల భయం పట్టుకుందని, ఎన్నికలు నిర్వహిస్తే తమ పార్టీ ఎక్కడ తుడిచిపెట్టుకు పోతుందననే భయం ఆవహరించిందని ఇమ్రాన్ పేర్కొన్నట్టు 'స్కై న్యూస్' ఆధివారంనాడు ఒక వార్తాకథనంలో తెలిపింది.

నాపై రెండుసార్లు హత్యాయత్నాలు

ఎన్నికల భయం కారణంగానే తనను జైలుకు పంపి ఎన్నికలు జరపడమో, తనను చంపిన తర్వాత ఎన్నికల జరపడమో చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు ఇమ్రాన్ ఖాన్ తీవ్రారోపణలు చేశారు. తనపై రెండు సార్లు హత్యాయత్నాలు జరిగినట్టు చెప్పారు. తాను ఇంట్లో లేనప్పుడు తన ఇంటిపై కూడా రెయిడ్స్ చేశారని అన్నారు. ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల తనను అరెస్టు చేయడంతో చెలరేగిన హింసను ఆయన ఖండించారు. మే 9న జరిగిన హింసాకాండపై విచారణకు ఆదేశించాలని తాను సుప్రీంకోర్టును కోరినట్టు శుక్రవారంనాడు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించిన మాట్లాడుతూ ఇమ్రాన్ అన్నారు.

కాగా, ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకూ పార్టీ మద్దతుదారులు 'రాజ్యాంగాన్ని రక్షించండి...దేశాన్ని కాపాడండి' అనే నినాదంతో కూడిన ప్లకార్డులతో ఇళ్ల నుంచి బయటకు రావాలని, అక్కడకు సమీప ప్రాంతంలో అంతా ఒక చోటకు చేరుకోవాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. 27 ఏళ్ల పోరాటంలో తన మద్దతుదారులు ఎప్పుడూ శాంతియుతంగానే ఉన్నారని, పీటీఐ మద్దతుదారులు, కార్యకర్తలపై మే 25న పోలీసులు జరిపిన హింసను తాను ఎప్పటికీ మరచిపోనని మాజీ పీఎం తెలిపారు.

Updated Date - 2023-05-14T20:38:10+05:30 IST