Hamas - Israel War: ఇజ్రాయెల్‌లో హమాస్ దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-10-08T14:04:52+05:30 IST

ఇజ్రాయెల్‌లో హమాస్ భీకర దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌పై దాడులకు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరోక్షంగా హమాస్‌కు నిధులు సమకూర్చారని నిందించారు. హమాస్ జరిపిన దాడులు చాలా అవమానకరమైనవని, ఇజ్రాయెల్ తన శక్తిసామర్థ్యాలతో స్వీయ రక్షణ చేసుకునే అన్ని హక్కులూ ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Hamas - Israel War: ఇజ్రాయెల్‌లో హమాస్ దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: ఇజ్రాయెల్‌లో హమాస్ భీకర దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌పై దాడులకు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరోక్షంగా హమాస్‌కు నిధులు సమకూర్చారని నిందించారు. హమాస్ జరిపిన దాడులు చాలా అవమానకరమైనవని, ఇజ్రాయెల్ తన శక్తిసామర్థ్యాలతో స్వీయ రక్షణ చేసుకునే అన్ని హక్కులూ ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘ దురదృష్టవశాత్తూ అమెరికన్ పన్ను చెల్లింపుదారుల నిధులు ఈ దాడులకు సాయపడ్డాయి. జో బైడెన్ ప్రభుత్వం నుంచే వచ్చాయని చాలా రిపోర్టులు చెబుతున్నాయి’’ అని ట్రంప్ ఆరోపించారు. ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఆరు నెలలక్రితం ఇరాన్‌కు అమెరికా 6 బిలియన్ డాలర్లు విడుదల చేసింది. ఈ నిధులు హమాస్‌కు మళ్లాయనే ఉద్దేశ్యంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఇదిలావుండగా వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ ఆండ్ర్యూ బేట్స్.. ట్రంప్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ... ఇది సిగ్గుమాలిన అబద్ధమని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఇజ్రాయెల్‌కు మద్ధతుగా నిలిచే విషయంలో అమెరికాలోని రెండు పక్షాలు ఒక్కటిగా నిలవాల్సి ఉందని సూచన చేశారు. ఆహారం, మెడిసిన్ వంటి మానవ అవసరాల కొనుగోలుకు మాత్రమే డబ్బు ఉపయోగించారని, ఈ విషయాన్ని పరిశీలించామని ట్రంప్‌పై ఆండ్ర్యూ బేట్స్ మండిపడ్డారు.

Updated Date - 2023-10-08T14:04:52+05:30 IST