Share News

Trump: అమెరికా అధ్యక్ష బరిలో ముందంజలో ట్రంప్.. బైడెన్ వెనకబాటు

ABN , First Publish Date - 2023-12-10T11:04:06+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు(America President Elections) 2024లో జరగనుండగా వాల్ స్ట్రీట్ జర్నల్(Wall Street Journal) ప్రచురించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

Trump: అమెరికా అధ్యక్ష బరిలో ముందంజలో ట్రంప్.. బైడెన్ వెనకబాటు

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు(America President Elections) 2024లో జరగనుండగా వాల్ స్ట్రీట్ జర్నల్(Wall Street Journal) ప్రచురించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రత్యర్థులతో పోల్చితే గెలిచే అవకాశాల్లో ముందు వరుసలో ఉన్నారని జర్నల్ ప్రచురించింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) 47 శాతం నుంచి 43 శాతానికి పడిపోయారు.

ఈ సర్వేలో ప్రెసిడెంట్ రేసులో ట్రంప్ ముందువరుసలో ఉన్నారని వెల్లడైంది. బైడెన్ కి అత్యల్ప రేటింగ్ నమోదైందని సర్వే సారాంశం. ఎన్నికలు మరో ఏడాదిలో జరగనుండగా తాజా సర్వే దేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తోంది. పోటీలో ఉన్న మిగతా పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు సమష్టిగా 17 శాతం మద్దతు పొందారు. ట్రంప్ కి ప్రజాదరణ 31 నుంచి 37 శాతానికి పెరిగింది.


బైడెన్‌ను వద్దనుకుంటున్న సొంత పార్టీ నేతలు...

జో బైడెన్ రెండోసారి పదవిని కోరుకుంటున్నప్పటికీ ఆయనకు సొంత పార్టీ నుంచే అసమ్మతి తప్పట్లేదు. ఆయన వయసురీత్యా అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల సమయానికి బైడెన్ కి 81 ఏళ్లు నిండుతాయి. ఒకవేళ అధ్యక్ష పదవి మళ్లీ చేపడితే రెండో టర్మ్ ముగిసే సరికి 85 ఏళ్లకు చేరుకుంటారు.

వయసు పెరిగేకొద్ది ప్రభుత్వ బాధ్యతలు కష్టతరమవుతాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆయన స్థానంలో కుమారుడు హంటర్ బైడెన్ ని బరిలో దింపాలని చూసినా ఆయనపై ఉన్న నేరారోపణలు అధ్యక్ష పీఠం నుంచి దూరం చేశాయని నిపుణులు భావిస్తున్నారు.

ట్రంప్‌కు సవాళ్లు..

మరోవైపు, రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలో దిగడానికి ముందు వరుసలో ఉన్న ట్రంప్‌‌కు సవాళ్లు తప్పేలా లేదు. 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలకు సంబంధించి కొనసాగుతున్న నాలుగు క్రిమినల్ కేసులతో సహా చట్టపరమైన సమస్యలు ఆయన అభ్యర్థిత్వానికి ముప్పు కలిగిస్తున్నాయి.

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలనాటికి ట్రంప్‌కు 78 ఏళ్లు నిండుతాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ సర్వే ఫలితాలు డెమొక్రాటల్లో ఆందోళన కలిగిస్తుండగా.. సర్వేను అంత సీరియస్ గా తీసుకోవద్దని ఆ పార్టీ నేతలు సూచిస్తున్నారు.

Updated Date - 2023-12-10T11:05:40+05:30 IST