Share News

Laser Message From Space: అంతరిక్షం నుంచి భూమికి తొలిసారి అందిన లేజర్ సందేశం

ABN , First Publish Date - 2023-11-23T17:15:37+05:30 IST

ఖగోళ శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. అంతరిక్షం నుంచి మొట్టమొదటిసారి లేజర్ కమ్యూనికేషన్ సందేశాన్ని అందుకున్నారు. 16 మిలియన్ కిలోమీటర్లు లేదా 10 మిలియన్ మైళ్ల దూరం నుంచి ఈ మెసేజ్ అందిందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమి, చంద్రుడి మధ్య దూరానికి 40 రెట్లకు ఇది సమానమని, అత్యంత దూరం నుంచి భూగ్రహానికి అందిన ఆప్టికల్ కమ్యూనికేషన్ ఇదేనని పేర్కొన్నారు.

Laser Message From Space: అంతరిక్షం నుంచి భూమికి తొలిసారి అందిన లేజర్ సందేశం

ఖగోళ శాస్త్రవేత్తలు కీలక పురోగతిని సాధించారు. అంతరిక్షం నుంచి మొట్టమొదటిసారి లేజర్ కమ్యూనికేషన్ సందేశాన్ని అందుకున్నారు. 16 మిలియన్ కిలోమీటర్లు లేదా 10 మిలియన్ మైళ్ల దూరం నుంచి ఈ మెసేజ్ అందిందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమి, చంద్రుడి మధ్య దూరానికి 40 రెట్లకు ఇది సమానమని, అత్యంత దూరం నుంచి భూగ్రహానికి అందిన ఆప్టికల్ కమ్యూనికేషన్ ఇదేనని పేర్కొన్నారు. డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ (DSOC) పరికరం ద్వారా ఈ ప్రయోగం చేశామని నాసా శాస్త్రవేత్తలు వివరించారు.

నాసాకు చెందిన ‘సైక్’ (Psyche) స్పేస్‌క్రాఫ్ట్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టినట్టు నాసా తెలిపింది. అక్టోబర్ 13న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టామని, అప్పటి నుంచి విజయవంతంగా భూమికి లెజర్ ప్రసార సందేశం అందుతోందని తెలిపింది. నవంబర్ 14న కాలిఫోర్నియాలోని పాలోమర్ అబ్జర్వేటరీ వద్ద ఉన్న హేలీ టెలిస్కోప్‌తో ‘సైక్ స్పేస్‌’ కమ్యూనికేషన్‌ సంబంధాన్ని ఏర్పరచుకుందని నాసా వివరించింది. టెస్టింగ్ సమయంలో డీఎస్‌వోఎస్‌కు చెందిన సమీప ఇన్‌ఫ్రారెడ్ ఫొటాన్లు 50 సెకన్లలో సైక్ నుంచి భూమికి చేరాయని, విజయవంతమైన ఈ మొదటి కమ్యూనికేషన్‌ లింక్‌ని ‘తొలి కాంతి’గా భావిస్తున్నామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Updated Date - 2023-11-23T17:15:38+05:30 IST