Earthquake: సెంట్రల్ చిలీలో భారీ భూకంపం...
ABN , First Publish Date - 2023-03-31T09:27:18+05:30 IST
సెంట్రల్ చిలీ తీరంలో భూకంపం సంభవించింది...
శాంటిగో (చిలీ): సెంట్రల్ చిలీ తీరంలో భూకంపం సంభవించింది.(Earthquake) సెంట్రల్ చిలీలో(Central Chile) రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(National Center for Seismology) (ఎన్‌సిఎస్) తెలిపింది.గురువారం రాత్రి 11.03 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అధికారులు చెప్పారు. ఈ భూకంపం ప్రభావంతో చిలీ తీర ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా సమాచారం లేదు.తరచూ భూకంపాలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.