Indians: భారతీయులు వెళ్తున్న విమానంపై అనుమానం.. తనిఖీ చేస్తున్న ఫ్రాన్స్ పోలీసులకు షాక్
ABN , Publish Date - Dec 23 , 2023 | 11:30 AM
దుబాయి నుంచి 300 మంది భారతీయులను అక్రమంగా రవాణా(Human Trafficking) చేస్తున్నారన్న సమాచారం అందటంతో సదరు ఫ్లైట్‌ని ఫ్రాన్స్ అధికారులు తమ దేశంలో ఆపేశారు. తరువాత చెకింగ్ చేయగా నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి.
ఢిల్లీ: దుబాయి నుంచి 300 మంది భారతీయులను అక్రమంగా రవాణా(Human Trafficking) చేస్తున్నారన్న సమాచారం అందటంతో సదరు ఫ్లైట్‌ని ఫ్రాన్స్ అధికారులు తమ దేశంలో ఆపేశారు. తరువాత చెకింగ్ చేయగా నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రోమేనియాకు చెందిన ఎయిర్ బస్ ఏ340(AirBus A 340) చార్టర్ విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 303 మంది భారతీయులతో టేకాఫ్ అయింది.
తరువాత సాంకేతిక కారణాలతో దాన్ని తూర్పు ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో దింపారు. గుర్తుతెలియని వ్యక్తుల సమాచారంతో ఫ్రాన్స్ ఆఫీసర్లు విమానాన్ని తనిఖీ చేశారు. అందులో భారత్ కి చెందిన 303 మంది ఉండటం అనుమానాలు తావిచ్చింది.
వారంతా మానవ అక్రమ రవాణా బాధితులని పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అనుమానాలు వ్యక్తం చేసింది. వ్యవస్థీకృత నేరాలు చేస్తున్న ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఫ్రాన్స్ లో భారత రాయబార కార్యాలయం ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టింది.
విషయం తెలుసుకున్న భారత అధికారులు బాధితుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఆ ఫ్లైట్ యూఏఈ నుంచి అమెరికాలోని నికరాగ్వాకు బయల్దేరినట్లు తెలుస్తోంది. వారిని అమెరికా లేదా కెనడాకి అక్రమంగా తీసుకెళ్లాలని నిందితులు చూశారని అధికారులు చెబుతున్నారు. ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
"మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి"