Russian city: ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో రష్యా నగరంలో భారీ పేలుడు

ABN , First Publish Date - 2023-04-21T09:43:49+05:30 IST

రష్యా యుద్ధ విమానం అనుకోకుండా సొంత నగరంపైనే దాడి చేసింది....

Russian city: ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో రష్యా నగరంలో భారీ పేలుడు
Russian city Huge blast

మాస్కో : రష్యా యుద్ధ విమానం అనుకోకుండా సొంత నగరంపైనే దాడి చేసింది.(Russian city) ఉక్రెయిన్‌ దేశ సరిహద్దులో ఉన్న బెల్‌గోరోడ్‌లో పేలుడు సంభవించడంతో సిటీ సెంటర్‌లో భారీ గుంత ఏర్పడిందని రష్యా అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ దేశంపై దాడులు చేస్తున్న రష్యా యుద్ధవిమానం పొరపాటు ఉక్రెయిన్(Ukraine) సరిహద్దు సమీపంలోని రష్యా నగరంపై దాడి చేయడంతో అక్కడ పేలుడు(Huge blast) సంభవించింది.రష్యా యుద్ధవిమానం వేసిన బాంబులతో పేలుడు సంభవించి భవనాలు దెబ్బతిన్నాయని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ పేలుడు వల్ల ప్రధానవీధిలో 20 మీటర్ల గుంత ఏర్పడిందని బెల్గోరోడ్ ప్రాంతీయ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్‌కోవ్ తెలిపారు.

ఇది కూడా చదవండి : Poonch Terror Attack: ఉగ్ర దాడి నేపథ్యంలో జమ్మూకశ్మీరులో హై అలర్ట్

పేలుడు జరిగిన ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు. రష్యాకు చెందిన సుఖోయ్ సు-34 వైమానిక దళ విమానం ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న బెల్గోరోడ్ నగరం మీదుగా ఎగురుతున్నప్పుడు విమాన మందుగుండు సామగ్రి అనుకోకుండా విడుదల చేసిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది ఈ పేలుడులో ఇద్దరు మహిళలు గాయపడ్డారని వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ తెలిపారు.పేలుడు జరిగిన ప్రదేశంలో నుంచి తీసిన విజువల్స్ లో దెబ్బతిన్న కార్లు, విరిగిన కిటికీలతో కూడిన భవనాలు కనిపించాయి.

Updated Date - 2023-04-21T09:43:49+05:30 IST