Imran Khan: పాక్ ఆర్మీ మాజీ చీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-24T16:26:59+05:30 IST

పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా (Qmar Jeved Bajwa)పై ఆ దేశ పదవీచ్యుత

Imran Khan: పాక్ ఆర్మీ మాజీ చీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా (Qmar Jeved Bajwa)పై ఆ దేశ పదవీచ్యుత ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. బజ్వా సలహా మేరకే అప్పట్లో తాను పంజాబ్, ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్షియల్ అసెంబ్లీలను రద్దు చేసినట్టు చెబుతూ బాంబు పేల్చారు. ఓ ప్రైవేటు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలు కనుక కోరుకుంటే తొలుత ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న తమ ప్రభుత్వాలను రద్దు చేయాలని బజ్వా తనకు సూచించారని ఖాన్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ సమావేశంలో అధ్యక్షుడు అరీఫ్ అల్వీ కూడా ఉన్నట్టు చెప్పారు. షేబాజ్ షరీఫ్‌ను అధికార పీఠంపై కూర్చోబెట్టాలని బజ్వా చూస్తున్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తనకు చెప్పినట్టు ఇమ్రాన్ తెలిపారు.

ప్రస్తుత పాలకులు ఖజానా నుంచి సొమ్మును దొంగిలించి విదేశాలకు తరలించుకుపోయిన విషయం జనరల్ బజ్వాకు, ఇంటెలిజెన్స్ చీఫ్‌కు తెలుసని ఇమ్రాన్ అన్నారు. ఇది తెలిసి కూడా జనరల్ బజ్వా వారికి ‘ఎన్ఆర్వో’ ఇచ్చేందుకు సిద్ధపడ్డారని, తన పదవీ కాలాన్ని పెంచుకునేందుకే ఆయన ఇలా చేశారని ఇమ్రాన్ ఆరోపించారు.

Updated Date - 2023-04-24T16:29:47+05:30 IST