Japan: జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా ప్రసంగిస్తుండగా పేలుడు...ప్రధాని క్షేమం

ABN , First Publish Date - 2023-04-15T08:51:02+05:30 IST

జపాన్ దేశంలో సభలో శనివారం పెద్ద పేలుడు ఘటన జరిగింది....

Japan: జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా ప్రసంగిస్తుండగా పేలుడు...ప్రధాని క్షేమం
Japan PM Fumio Kishida

టోక్యో(జపాన్): జపాన్ దేశంలో సభలో శనివారం పెద్ద పేలుడు ఘటన జరిగింది. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా(Japan PM Fumio Kishida) వాకయామా నగరంలో ప్రసంగిస్తుండగా(during speech in Wakayama) ఒక్కసారిగా పేలుడు(Blast) సంభవించింది. దీంతో జపాన్ ప్రధానమంత్రి పుమియో కిషిడా ఉపన్యాసం ఆపి హుటాహుటిన తరలించారు. ప్రధాని పుమియో కిషిడా ప్రసంగం మధ్యలో పొగబాంబుతో దాడి చేశారు. పొగబాంబు ప్రధాని సమీపంలో వేశారు. దీంతో ప్రధాని పుమియో ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి పరుగెత్తాల్సి వచ్చింది. భద్రతా సిబ్బంది ప్రధాని కిషిడాను ఘటనా స్థలం నుంచి క్షేమంగా తీసుకువెళ్లారు. పశ్చిమ జపాన్ నగరమైన వాకయామాలో ప్రధాని కిషిడా ఫిషింగ్ హార్బరును పరిశీలించిన తర్వాత ప్రసంగిస్తుండగా బాంబు పేలుడు జరిగిందని జపాన్ అధికారులు చెప్పారు. బాంబు పేల్చిన వ్యక్తిని జపాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2023-04-15T09:23:23+05:30 IST