Imran Khan : అరెస్ట్‌పై వెనుకకు తగ్గిన కోర్టు
ABN , First Publish Date - 2023-03-16T14:36:48+05:30 IST
అవినీతి కేసులో కీలక పరిణామం జరిగింది. పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్ట్‌ను
ఇస్లామాబాద్ : తోషాఖానా అవినీతి కేసులో కీలక పరిణామం జరిగింది. పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్ట్‌ను వాయిదా వేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు తరలివచ్చి, పోలీసులతో ఘర్షణ పడుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలను జారీ చేసింది.
ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు ఫవద్ చౌదరి పాకిస్థానీ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు నిర్వహిస్తున్న ఆపరేషన్‌ను శుక్రవారం వరకు వాయిదా వేయాలని లాహోర్ హైకోర్టు (Lahore High Court) గురువారం ఆదేశించింది. ఈ విషయాన్ని స్టేట్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అమిర్ మిర్ ధ్రువీకరించారు.
ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు మంగళ, బుధవారాల్లో ప్రయత్నించారు. అయితే ఆయన మద్దతుదారులు గట్టిగా ప్రతిఘటించారు. దీంతో అరెస్ట్ చేయడం సాధ్యం కాలేదు.
విదేశాల నుంచి వచ్చిన బహుమతులను నిబంధనల ప్రకారం తోషాఖానా (ఖజానా)కు అప్పగించవలసి ఉంటుంది. అయితే ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో (2018-2022) ఆయనకు వచ్చిన బహుమతులను తోషాఖానాలో పెట్టకుండా, చట్టవిరుద్ధంగా విక్రయించారని కేసు నమోదైంది. కోర్టులో తనంతట తాను వచ్చి హాజరవాలని ఆయనను ఇస్లామాబాద్ కోర్టు ఆదేశించింది. ఈ ఆరోపణలను ఆయన తిరస్కరించారు. అయితే నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఆయన దోషి అని నిర్థరించి, ఒక పార్లమెంటరీ పదవీ కాలంపాటు ఆయన ప్రభుత్వ పదవులను చేపట్టరాదని నిషేధం విధించింది.
Parliament : పార్లమెంటుకు రాహుల్ గాంధీ?... క్షమాపణ చెప్పబోతున్నారా?...
Nobel Peace Prize : మోదీకి నోబెల్ శాంతి బహుమతి... నోబెల్ ప్రైజ్ కమిటీ నేత సంచలన వ్యాఖ్యలు...