North Korea: అమెరికా వెన్నులో చలి.. కిమ్ ఖండాంతర క్షిపణి రెడీ
ABN , First Publish Date - 2023-03-17T20:39:41+05:30 IST
ఇది 33 నిమిషాల్లో అమెరికా(USA)లోని లక్ష్యాలపై గురి తప్పకుండా ఢీ కొంటుందని చైనా అధ్యయనం ఒకటి తేల్చింది.
న్యూఢిల్లీ: అమెరికా(United States of America)ను అరగంటలో ఢీ కొట్టే ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్(intercontinental ballistic missile)ను ఉత్తరకొరియా(North Korea) అభివృద్ధి పరిచింది. ఇది 33 నిమిషాల్లో అమెరికా(USA)లోని లక్ష్యాలపై గురి తప్పకుండా ఢీ కొంటుందని చైనా అధ్యయనం(Chinese study) ఒకటి తేల్చింది. ఓపెన్ న్యూక్లియర్ నెట్‌వర్క్ అనలిస్ట్ తియన్రాన్ జు(Tianran Xu) తెలిపిన వివరాలు అమెరికా వెన్నులో వణుకు పుట్టించేవిలా ఉన్నాయి. అమెరికాలో ఇప్పటికే ఉన్న క్షిపణి రక్షక వ్యవస్థ కూడా ఉత్తరకొరియా అభివృద్ధి చేసిన తాజా మిసైల్‌ను గుర్తించలేదట. ఉత్తరకొరియానుంచి ప్రయోగించిన 20 సెకండ్ల వరకూ అమెరికాకు కనీసం గుర్తించడం కూడా సాధ్యం కాదట. అమెరికాలోని తూర్పు తీరాన్ని అలాగే పశ్చిమతీరాన్ని కూడా ఈ క్షిపణి సులభంగా చేరగలదట. హ్వాసోంగ్-15(Hwasong-15 missile) పేరిట ఉత్తరకొరియాలోని కిమ్ ప్రభుత్వం(Kim Jong Un) అభివృద్ధి పరిచిన ఈ అణ్వస్త్ర క్షిపణి రేంజ్ 13 వేల కిలోమీటర్లు.
చైనా అధ్యయనంలో వెల్లడైన అంశాలపై అమెరికాలోని బైడెన్(Joe Biden) ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.