Share News

Pakistan Attack: ఆత్మాహుతి దాడిలో 23 మంది మృతి

ABN , First Publish Date - 2023-12-12T15:54:16+05:30 IST

పాకిస్తాన్‌ లోని ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌‌లో భద్రతా సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు మంగళవారంనాడు ఆత్మాహుతి దాడి జరిపారు. ఒక పోలీస్ స్టేషన్‌పై జరిపిన ఆత్మాహుతి దాడిలో 23 మంది మృతి చెందగా, మరో 16 మంది గాయపడ్డారు.

Pakistan Attack: ఆత్మాహుతి దాడిలో 23 మంది మృతి

పెషావర్: పాకిస్తాన్‌ (Pakistan)లోని ఖైబర్ ఫంక్తున్వా ప్రావిన్స్‌‌లో భద్రతా సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు మంగళవారంనాడు ఆత్మాహుతి దాడి (Suicide attack) జరిపారు. ఒక పోలీస్ స్టేషన్‌పై జరిపిన ఆత్మాహుతి దాడిలో 23 మంది మృతి చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. సౌత్ వజీరిస్తాన్ గిరిజన జిల్లాకు సరిహద్దున ఉన్న డేరా ఇస్మాయిల్ ఖాన్ జిలాలాలోని ఓ మారుమూల పోలీస్ స్టేషన్‌పై ఈ దాడి జరిగింది.


పోలీస్ స్టేషన్‌ను పేలుడు పదార్ధాలతో కూడిన వాహనంతో ఉగ్రవాదులు ఢీకొట్టారని, అనంతరం మోర్టార్ దాడులు జరిపారని ప్రత్యక్ష సాక్షుల కథనం. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుదాడికి దిగిందని, కనీసం నలుగురు సిబ్బంది గాయపడగా, మరో 16 మంది గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమైనట్టు ఏఆర్‌వై న్యూస్ ఛానెల్ తెలిపింది. ఘటన సమాచారం తెలియగానే అదనపు భద్రతా బలగాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. జిల్లాలోని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించగా, స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. పాకిస్థాన్‌ తాలిబన్లు గత నవంబర్‌ నుంచి వరుస ఉగ్ర దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో పెషావర్‌లో రద్దీగా ఉండే ఒక మసీదు సమీపంలో ఉగ్రవాదులు భారీ పేలుడుకు దిగడంతో సుమారు 100 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2023-12-12T15:54:18+05:30 IST