Viral Video: మీడియా లైవ్‌లో చెప్పుతో కొట్టుకున్న పాకిస్థాన్ లీడర్లు
ABN , First Publish Date - 2023-09-29T12:43:03+05:30 IST
టీవీ లైవ్ డిబెట్ల(TV Live Debates)లో లీడర్ల వాదనలు చూస్తూనే ఉంటాం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, వ్యక్తిగత విమర్శలకు సైతం వెనకాడబోరు. అవి చాలవనుకుంటే ఏకంగా భౌతికదాడులకు దిగుతారు. ఇలాంటి ఉదంతాలు భారత మీడియా చరిత్రలో చాలానే చూశాం. అయితే దాయాది దేశం పాకిస్థాన్(Pakisthan) లో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది.
పాకిస్థాన్: టీవీ లైవ్ డిబెట్ల(TV Live Debates)లో లీడర్ల వాదనలు చూస్తూనే ఉంటాం. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, వ్యక్తిగత విమర్శలకు సైతం వెనకాడబోరు. అవి చాలవనుకుంటే ఏకంగా భౌతికదాడులకు దిగుతారు. ఇలాంటి ఉదంతాలు భారత మీడియా చరిత్రలో చాలానే చూశాం. అయితే దాయాది దేశం పాకిస్థాన్(Pakisthan) లో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. వీళ్లు ఏకంగా చెప్పులతో దాడి చేసుకున్నారు. వివరాలు.. జావేది చౌదరి(Javedi Chowdary) హోస్ట్ చేసిన ప్రముఖ పాకిస్థానీ టాక్ షో 'కల్ తక్' షోలో ఈ ఘటన జరిగింది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) కి చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ కి అనుబంధంగా ఉన్న న్యాయవాది షేర్ అఫ్జల్ మార్వత్, మాజీ ప్రధాని నవాజ్ షెరీఫ్(Nawaz Sharif) కి చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) నుంచి సెనేటర్ అయిన అఫ్నాన్ ఉల్లా టీవీ డిబెట్లో పాల్గొన్నారు.
ఇమ్రాన్ ఖాన్‌పై సెనేటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై మండిపడ్డ మార్వాట్ భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో ఖాన్ తలకి గాయమైంది. ఖాన్ ప్రతీకారం తీర్చుకోవడానికి చెప్పుతో తిరిగి దాడి చేశారు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. షో సిబ్బంది, హోస్ట్ వారిని విడిపించడానికి ప్రయత్నించినప్పటికీ చాలా సేపటి వరకు గొడవ కొనసాగడంతో దేశ ప్రజలు దృశ్యాలను లైవ్ గా చూశారు. అనంతరం ఇరువురు నేతలు తమ సోషల్ మీడియా(Social Media) అకౌంట్లలో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇరువురి గొడవను చాలా సేపటి వరకు ఆపకపోవడంతో కల్ తక్ హోస్ట్, సిబ్బందిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో నేతల శైలిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ వీడియో వైరల్ అయింది.