Prince William : ఇండియన్ రెస్టారెంట్‌లో రిసెప్షనిస్ట్‌గా ప్రిన్స్ విలియం
ABN , First Publish Date - 2023-04-21T13:44:57+05:30 IST
బ్రిటన్‌లోని బర్మింగ్‌హాంలో ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో ప్రిన్స్ విలియం దంపతులు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ రెస్టారెంట్‌లో రిజర్వేషన్ కోసం ఫోన్ చేసిన
లండన్ : బ్రిటన్‌లోని బర్మింగ్‌హాంలో ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో ప్రిన్స్ విలియం దంపతులు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ రెస్టారెంట్‌లో రిజర్వేషన్ కోసం ఫోన్ చేసిన ఇద్దరు కస్టమర్ల ఫోన్‌ను అటెండ్ చేశారు. వారితో నైపుణ్యంగల రిసెప్షనిస్ట్ మాదిరిగా మాట్లాడారు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యంతోపాటు రిజర్వేషన్ చేయించుకున్నవారు కూడా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు.
బర్మింగ్‌హాంలోని ఈ ఇండియన్ స్ట్రీటరీని మీనా శర్మ నడుపుతున్నారు. ప్రిన్స్ విలియం (Prince William), ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ (Princess Kate Middleton) దంపతులు గురువారం ఈ రెస్టారెంట్‌కు గురువారం వెళ్ళారు. ఆ సమయంలో వినయ్ అగర్వాల్ అనే కస్టమర్ ఫోన్ చేశారు. ఆ ఫోన్‌ను ప్రిన్స్ విలియం అటెండ్ చేశారు. ‘‘మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఆయనకు తెలుసు. ఆయనను నేను ఇప్పుడు బర్మింగ్‌హాంలో వేరే చోటుకు పంపి ఉంటాను, క్షమించండి’’ అన్నారు.
వినయ్ అగర్వాల్ తన సతీమణి అంకిత గులాటీతో కలిసి సెంట్రల్ ఇంగ్లండ్‌కు వెళ్లినపుడు ఈ అనూహ్య మధురానుభూతి లభించింది. వినయ్ లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఈ రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినపుడు రాజ వంశీకుడు తమ ఫోన్ కాల్‌ను స్వీకరించారు. ఆ విషయం వారిద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వచ్చే వరకు వారికి తెలియదు. ప్రిన్స్ విలియం తమ ఫోన్ కాల్‌ను స్వీకరించినట్లు తెలుసుకున్న వినయ్ మాట్లాడుతూ, ‘‘ఇది అత్యద్భుతం, ఆశ్చర్యకరం. ఆ క్షణంలో నాకు తెలియదు, కానీ ఇది చాలా చాలా గొప్ప ఆశ్చర్యకరం. ఈ విషయాన్ని నేను అందరితోనూ పంచుకుంటాను. ఇలాంటివి మళ్లీ మళ్లీ జరిగేవి కాదు’’ అని చెప్పారు. ‘‘ఆయన (ప్రిన్స్ విలియం) గొంతును నేను గుర్తుపట్టలేదు. ఫోన్‌లో ఆయన మాటలను వినడం ఇదే మొదటిసారి. నా బుకింగ్‌ను వేరే ఎవరో తీసుకుంటున్నారని నేను అనుకున్నాను’’ అని చెప్పారు.
రెస్టారెంట్ యజమాని మీనా శర్మ మాట్లాడుతూ, తమ ఫ్రంట్ ఆఫీస్‌లో ప్రిన్స్ విలియం సేవల పట్ల సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఆయన చుట్టూ తామంతా చేరామని, ఆయన తమ కస్టమర్ ఫోన్‌ను అటెండ్ చేసి, మాట్లాడిన తీరు తమకు చాలా ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. ‘‘దిస్ ఈజ్ ఇండియన్ స్ట్రీటరీ’’ అని ప్రిన్స్ విలియం చెప్పారని గుర్తు చేసుకున్నారు. అవతలివైపు వ్యక్తి జెన్యూన్‌గా బుకింగ్ కోసం ఫోన్ చేసిన వ్యక్తి అని చెప్పారు. ప్రిన్స్ విలియం చాలా బాగా పని చేశారని, భవిష్యత్తులో ఆయనను ఆ ఉద్యోగంలో నియమించుకోవడం గురించి పరిశీలిస్తామని నవ్వుతూ చెప్పారు.
ప్రిన్స్ విలియం దంపతులు ఈ రెస్టారెంట్లో మరో పోటీలో కూడా పాల్గొన్నారు. విలియం, కేట్ వంట గదిలోకి వెళ్లి, రొట్టెలను తయారు చేశారు. ఈ పోటీకి జడ్జిగా శర్మ వ్యవహరించారు. ఈ పోటీలో కేట్ గెలిచినట్లు శర్మ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి :
NCERT : పదో తరగతి సిలబస్‌లో కొన్ని భాగాల తొలగింపుపై శాస్త్రవేత్తలు, విద్యావేత్తల ఆగ్రహం
Coca Cola Company : 35 ఎకరాల భూమిని కేరళ ప్రభుత్వానికి అప్పగించనున్న కోకా-కోలా కంపెనీ