Dog Decease in UK:యూకేలో శునకాల వ్యాధి బారిన పడుతున్న జనం..

ABN , First Publish Date - 2023-09-19T21:16:49+05:30 IST

శునకాలకు(Dogs) మాత్రమే సోకే ఓ అరుదైన వ్యాధి బారిన పడి యూకే(UK)లో పబ్లిక్ అస్వస్థతకు గురవుతున్నారు. బ్రూసెల్లా కానిస్(Brucella canis) అనే ఈ వ్యాధి మనుషులకూ సోకుతుండటంపై ఆ దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Dog Decease in UK:యూకేలో శునకాల వ్యాధి బారిన పడుతున్న జనం..

యూకే : శునకాలకు(Dogs) మాత్రమే సోకే ఓ అరుదైన వ్యాధి బారిన పడి యూకే(UK)లో పబ్లిక్ అస్వస్థతకు గురవుతున్నారు. బ్రూసెల్లా కానిస్(Brucella canis) అనే ఈ వ్యాధి మనుషులకూ సోకుతుండటంపై ఆ దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధి కుక్కలలో నొప్పి, కుంటితనం, వంధ్యత్వానికి కారణమవుతోంది. కుక్కల్లో బద్ధకం, వృద్ధాప్యం త్వరగా రావడం, వెన్నునొప్పి కలిగించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నింటిలో ఇవేవీ కనిపించకపోవచ్చు. శునకాలకు ఈ వ్యాధి సోకితే ప్రాణాంతకంగా మారవచ్చని డాక్టర్లు(Doctors) చెబుతున్నారు. మనుషుల్లో దీని ప్రభావం కొంచమే ఉన్నప్పటికీ.. మెనింజైటిస్, సెప్టిసిమియాకు దారితీయవచ్చని అంటున్నారు. ఐదు కుక్కలను పెంచుకున్న ఓ వ్యక్తి గతేడాది ఇదే వ్యాధి సంక్రమించి మరణించాడు. 2020 వేసవి కాలం నుండి, కుక్కలలో బ్రూసెల్లా కానిస్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. తూర్పు ఐరోపా నుంచి యూకేకి దిగుమతి చేసుకున్న శునకాల నుంచే ఈ వ్యాధి సంక్రమించిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధితో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్లు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఈ ఏడాది 91 కేసులు..

2023లో బ్రూసెల్లా కేసులు 91 నమోదైనట్లు యూకే డాక్టర్లు చెప్పారు. ప్రమాదకరం కానప్పటికీ బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులు, గర్భిణీలు, చిన్నపిల్లలు ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది. 2020లో 9 కేసుల నుంచి 91 కేసులకు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ వ్యాధికి విరుగుడు లేదని డాక్టర్లు అంటున్నారు. మనుషులకి ఈ వ్యాధి సోకితే జ్వరం, తలనొప్పి తదితర లక్షణాలు ఉంటాయి. ఇవి బయటపడటానికి ఏళ్లు పట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. రక్తమార్పిడి వ్యాధి సంక్రమణకు కారణం కావచ్చని అంటున్నారు.

Updated Date - 2023-09-19T21:16:49+05:30 IST

News Hub