Share News

Joe Biden:గాజా ఆసుపత్రి ప్రమాదం స్వీయ తప్పిదం వల్లే జరిగింది: జో బైడెన్

ABN , First Publish Date - 2023-10-18T15:19:28+05:30 IST

గాజా(Gaza) ఆసుపత్రిపై జరిగిన బాంబ్ దాడి ప్రమాదం అవతలి వైపు వ్యక్తుల వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఆరోపించారు. ఇవాళ ఆయన ఇజ్రాయెల్(Israeil) లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం అయ్యారు. టెల్ అవీవ్(Tel Aviv) లో యుద్ధం వల్ల సంభవించిన ఆస్తి నష్టాన్ని చూశారు.

Joe Biden:గాజా ఆసుపత్రి ప్రమాదం స్వీయ తప్పిదం వల్లే జరిగింది: జో బైడెన్

జెరూసలెం: గాజా(Gaza) ఆసుపత్రిపై జరిగిన బాంబ్ దాడి ప్రమాదం అవతలి వైపు వ్యక్తుల వల్లే జరిగిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఆరోపించారు. ఇవాళ ఆయన ఇజ్రాయెల్(Israeil) లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం అయ్యారు. టెల్ అవీవ్(Tel Aviv) లో యుద్ధం వల్ల సంభవించిన ఆస్తి నష్టాన్ని చూశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. యుద్ధంలో దెబ్బతిన్న టెల్ అవివ్ ప్రాంతాన్ని బైడెన్ సందర్శించారు. హమాస్ 31 మంది అమెరికన్లతో సహా 13 వందల మందిని హత్య చేసిందని ఆయన ఆరోపించారు.


వారు పిల్లలతో సహా అనేక మందిని బందీలుగా పట్టుకున్నారని చెప్పారు. హమాస్ పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం లేదని కొత్త చిక్కులను తీసుకువచ్చిందని ఆయన అన్నారు. తమ వెంట ఉన్నందుకు బైడెన్ కి నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. "నాజీలను ఓడించడానికి నాగరిక ప్రపంచం ఏకం అయినట్లే, ఐఎస్‌ఐఎస్‌(ISIS)ను ఓడించడానికి ఏకమైనట్లే, హమాస్‌ను ఓడించడానికి నాగరిక ప్రపంచం ఏకం అయి ప్రపంచ శాంతి కోసం క‌ృషి చేయాలి" అని బైడెన్ అన్నారు.యుద్ధసమయంలో ఇజ్రాయెల్ ని సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడు బైడెన్ అని నెతన్యాహు తెలిపారు. అది ఇజ్రాయెల్ పై అమెరికాకు ఉన్న వ్యక్తిగత నిబద్ధతను తెలియజేస్తోందని బైడెన్ అన్నారు. యూఎస్ చేస్తున్న సహాయం, అందిస్తున్న సహకారం మరువలేనిదని అభివర్ణించారు. తమను తాము రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ చేసిన కృషిని బైడెన్ మెచ్చుకున్నారు. ఇజ్రాయెల్ - పాలస్తీనా గొడవల్లో ఇప్పటివరకు 2 వేల 778 మంది పాలస్తీనియన్లు మరణించారు.

Updated Date - 2023-10-18T15:21:53+05:30 IST