Pakistan: పాకిస్థాన్‌లో ఘోరం.. ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయుల కాల్చివేత

ABN , First Publish Date - 2023-05-04T20:05:31+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను కాల్చిచంపారు.

Pakistan: పాకిస్థాన్‌లో ఘోరం.. ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయుల కాల్చివేత
Seven teachers were killed in Khyber Pakhtunkhwa Pakistan

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో (Pakistan) దారుణం జరిగింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా (Khyber Pakhtunkhwa) కుర్రమ్ తహసిల్‌లోని (Kurram Tehsil) తరి మంగళ్ (Tari Mangal) ప్రభుత్వ పాఠశాలలో (Government High School) గుర్తు తెలియని దుండగులు (unidentified gunmen) ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను (seven teachers were killed) కాల్చిచంపారు. ఆయుధాలతో పాఠశాల స్టాఫ్‌రూమ్‌లోకి దూరి ఉపాధ్యాయులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటన పరాచినార్ ప్రాంతంలో జరిగింది. అక్కడ మరో ఉపాధ్యాయుడిని చంపేశారు. దీంతో చనిపోయిన ఉపాధ్యాయుల సంఖ్య 8కి పెరిగింది.

పట్టపగలు ఉపాధ్యాయులను కాల్చి చంపడంతో పాకిస్థాన్‌లో కలకలం రేగింది. ఘటనకు తామే బాధ్యులమని ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు.

పాకిస్థాన్‌లో ఇప్పటికే తీవ్ర ఆహార, ఆర్ధిక సంక్షోభం నెలకొంది. అనేక ప్రాంతాల్లో జనం తిండి దొరక్క అల్లాడిపోతున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. శాంతి భద్రతల పరిస్థితి కూడా ఘోరంగా మారింది.

Updated Date - 2023-05-04T20:17:15+05:30 IST