Indonesia: ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16మంది మృతి,50 మందికి గాయాలు

ABN , First Publish Date - 2023-03-04T07:20:47+05:30 IST

ఇండోనేషియా దేశంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 16 మంది దుర్మరణం చెందారు...

Indonesia: ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16మంది మృతి,50 మందికి గాయాలు
Jakarta fire accident

జకార్తా(ఇండోనేషియా): ఇండోనేషియా దేశంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 16 మంది దుర్మరణం చెందారు. ఇండోనేషియా(Indonesia) రాజధాని జకార్తాలోని ఇంధశన నిల్వ డిపోలో( Fuel Storage Depot) జరిగిన అగ్నిప్రమాదంలో 16 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.జకార్తా నగరంలోని ఇంధన సంస్థ పెర్టామినా నడుపుతున్న ఇంధన డిపోలో సంభవించిన అగ్నిప్రమాదంతో(Jakarta fire accident) చుట్టుపక్కల ఉన్న పలు ఇళ్లు దగ్థమయ్యాయి. దీంతో అగ్నిమాపకశాఖ అధికారులు ఇంధన డిపో సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా 16 మంది మరణించారని, కనీసం 50 మంది గాయపడ్డారని జకార్తా ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

ఇంధన డిపోలో మంటలు శుక్రవారం రాత్రి జరిగిన మంటల్లో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయని డిపార్ట్‌మెంట్ చీఫ్ సత్రియాడి గుణవన్ చెప్పారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. మంటలు ప్రారంభమైన కొన్ని గంటల తర్వాత మంటలను ఆర్పివేశామని ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డుదుంగ్ అబ్దురాచ్‌మన్ విలేకరులతో చెప్పారు. జకార్తా ఇంధన డిపోలో 2009,2014లలో రెండు అగ్నిప్రమాదాలు వాటిల్లాయి.2021లో పశ్చిమ జావాలోని బలోంగన్ రిఫైనరీలో భారీ మంటలు చెలరేగాయి.

Updated Date - 2023-03-04T07:52:17+05:30 IST